in

మరోసారి ప్రసారం కానున్న రామానంద్ సాగర్ ‘రామాయణం’

మరోసారి ప్రసారం కానున్న రామానంద్ సాగర్ ‘రామాయణం’

 

‘ఆదిపురుష్’ సినిమా ఏరకంగా విమర్శలు ఎదుర్కొంటోందో అందరికీ తెలిసిన విషయమే. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను బాన్ చేయాలని కూడా అనుకున్నారు. సోషల్ మీడియాలో అసంతృప్తిని తెలియజేస్తూ నెటిజనులు కామెంట్ల వర్షం కురిపించారు. కొందరు ఇది అసలు రామాయణమేనా అని ప్రశ్నిస్తుంటే.. మరి కొందరు దీనికంటే రామానంద సాగర్ తెరకెక్కించిన ‘రామాయణం’ సీరియల్ వంద రెట్లు మెరుగని ‘ఆదిపురుష్’ పై మండి పడుతున్నారు. ఇలాంటి సమయంలో రామానంద సాగర్ తెరకెక్కించిన ‘రామాయణం’ సీరియల్ ను మరో సారి ప్రసారం చేయాలని ఆ సీరియల్ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

1987 జనవరి 25 నుంచి 1988 జూలై 31 వరకు ప్రసారమైన ఈ సీరియల్ ను ఇప్పుడు అందరి అభిమానం పొందుతున్న ఈ సమయంలో రీ- టెలికాస్ట్ చేయనున్నారు.

అయితే ఈ సీరియల్ రీ-టెలికాస్ట్ అవ్వడం ఇది మొదటి సారేమి కాదు. కరోనా మహమ్మారి విజృంభించి ప్రజలను ఇళ్లకు పరిమితం చేసిన సమయంలో అంటే 2020 లో మార్చి 28 నుంచి ప్రతి ఆదివారం ఉదయం ప్రసారం చేశారు.

మొదటి సారిగా ప్రసారమైనప్పుడు అత్యదిక వీక్షణలు సొంతం చేసుకుని లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ఈ రామాయణం మొదటి సారి రీ – టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా 7.7 కోట్ల మంది వీక్షణలు పొంది అందర్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మళ్లీ రీ-టెలికాస్ట్ అవుతుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సీరియల్ ను రీ-టెలికాస్ట్ చేస్తున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన షెమారూ చానెల్ వారు ఆ పోస్టును కొంత సేపటికి తొలగించారు.

దీంతో ఈ సీరియల్ నిజంగానే రీ-టెలికాస్ట్ అవుతుందా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది.

What do you think?

“పవన్ కళ్యాణ్ నాకు అన్న లాంటి వారు” – కేటీఆర్

డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ.ఆ వెబ్‌సైట్లలో