“పవన్ కళ్యాణ్ నాకు అన్న లాంటి వారు” – కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పవన్ కళ్యాణ్ అన్న లాంటి వారని అన్నారు. తనకు పవన్ కు మధ్య మంచి స్నేహభందం ఉందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు లాగే తనకూ సాహిత్యం అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. పలు సందర్భాల్లో పవన్‌తో చాలా విషయాలు మాట్లాడానని.. అనేక అంశాల్లో వారిద్దరి అభిరుచులు కలుస్తాయని చెప్పుకొచ్చారు.
అయితే రాజకీయాలకు స్నేహలకు సంబంధం లేదని అన్న కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ ఏపీలో పోటీచేస్తుందని స్పష్టం చేశారు.