in ,

పాకిస్థాన్  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!

పాకిస్థాన్  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!

 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి.

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రికే ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ అధినేత అయిన ఇమ్రాన్ ఖాన్ గతేడాది ఏప్రిల్‍లో ప్రధాని పదవిని కోల్పోయారు. ఆయనపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. పాకిస్థాన్ దళాలు ఆయనను అరెస్ట్ చేసేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్న.. ఫలించలేదు. గతంలో కూడా ఆయన నివాసం వద్ద భారీ ఘర్షణలు జరిగాయి.

అయితే తాజాగా ఇమ్రాన్ ఖాన్ను ఇస్లామాబాద్ హైకోర్టు బయట పారామిలటరీ పోలీసులు (రేంజర్స్) అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ మీడియా సంస్థ  జియో న్యూస్ (Geo news) వెల్లడించింది.

ఇమ్రాన్ అరెస్ట్ పై  స్పందించిన పీటీఐ పార్టీ నాయకుడు ముష్రత్ చీమా ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. “వాళ్లు ఇమ్రాన్ ఖాన్‍ను హింసిస్తున్నారు. ఖాన్ సాహిబ్‍ను కొడుతున్నారు. ఆయనను ఏదో చేస్తున్నారు.” అంటూ ముష్రత్ చీమా ట్విట్టర్‌లో  వీడియో మెసేజ్ ను పోస్ట్ చేశారు.

What do you think?

“ఎర్రి పప్ప”కి కొత్త అర్థం చెప్పిన మంత్రి కారుమూరి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం. 15 మృతి…