in ,

“ఎర్రి పప్ప”కి కొత్త అర్థం చెప్పిన మంత్రి కారుమూరి

“ఎర్రి పప్ప”కి కొత్త అర్థం చెప్పిన మంత్రి కారుమూరి

 

ఏపీ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు “ఎర్రిపప్ప” అనే పదానికి కొత్త అర్థం చెప్పారు. “ఎర్రిపప్ప” అంటే “బుజ్జినాన్న” అని అర్థం, ఈ మాత్రం పరిజ్ఞానం లేని విపక్ష నేతలు తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

అసలు విషయం ఏంటంటే ఈ నెల ఆరో తేదీన మంత్రి వెంకట నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లాలో తన నియోజకవర్గంలోని తణుకు మండలం వేల్పూరులో పర్యటించారు. ఈ పర్యటనలో తన గోడు వెళ్ళబెట్టుకుందాం అనుకున్న ఓ రైతు తాము పండించిన ధాన్యం మొలకలొచ్చాయని చెప్పాడు. అయితే మంత్రి ఆ రైతుకు సలహా ఇవ్వకపోగ, “ఎర్రిపప్పు మొలకలొస్తే నేనేం చేస్తాను..” అంటూ ఆగ్రహం చూపించారు.

 

అంతే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతోపాటు సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది.

ఈ నేపథ్యంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన కారుమూరి.. తను రైతును దుర్భాషలాడలేదని, “ఎర్రి పప్ప” అంటే “బుజ్జినాన్న” అని అర్థం అని చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో కామూరి చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఒకరు “అయితే నిన్నూ కూడా ఎర్రి పప్ప.. అనమా బుజ్జినాన్న..” అని, ఇంకొకరు “151 మంది ఎమ్మెల్యేలు బుజ్జినాన్న లేనన్న మాట” అని కామెంట్ చేశారు.

What do you think?

“ది కేరళ స్టోరీ”  సినిమాపై స్పందించిన ఆర్జీవీ.. 

పాకిస్థాన్  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!