in

ఒడిశా రైలు ఘటనలో ట్విస్ట్.. పరారీలో ఇంజినీర్!

ఒడిశా రైలు ఘటనలో ట్విస్ట్.. పరారీలో ఇంజినీర్!

 

ఒడిశా రైలు ప్రమాద ఘటన పై విచారణకు సీబీఐని నియమించారన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీబీఐ విచారణ శరవేగంగా జరుపుతోంది. అయితే తాజాగా వారు విచారించిన ఓ ఇంజినీర్ ఎవరికీ తెలియకుండా పరారయ్యాడు.

సీబీఐ బాలాసోర్ స్టేషన్ రైలు సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ను ఇటీవల విచారించింది. ఇందులో భాగంగా మరోసారి ఇంజనీర్ ను విచారించేందుకు సీబీఐ అతని ఇంటికి వెళ్లింది. అయితే వారు అక్కడికి వెళ్ళే సరికి అతని ఇంటికి తాళం వేసుంది. చుట్టు పక్కల వారిని అడగగా.. అతను కొద్ది రోజుల క్రితమే తన కుటుంబంతో ఎక్కడికో వెళ్లాడని తెలిసింది. దీంతో సీబీఐ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. అతని జాడ కోసం సన్నిహితులను, బంధువులను ప్రశ్నిస్తున్నారు.

ఇలా ఇంజనీర్ కుటుంబంతో సహా చెప్పకుండా వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

What do you think?

టీమిండియాకు కొత్త కెప్టెన్.. అయ్యర్‌ కు ఛాన్స్

175 నియోజకవర్గాల్లో గెలవాల్సిందే – సీఎం జగన్