175 నియోజకవర్గాల్లో గెలవాల్సిందే – సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో గెలవాల్సిందేనని అన్నారు.
రాబోయే 9 నెలలు కీలకంగా మారనున్నాయని అన్నారు. ఎమ్మెల్యేల పని తీరు బాగుంటేనే వారిని కొనసాగిస్తామని.. లేదంటే ఇటు వారికీ అటు పార్టీకి నష్టమేనని జగన్ తెలిపారు. సర్వే చేసినప్పుడు వారి గ్రాఫ్‌లు బాగుండాలని.. ఇందుకోసం గడప గడపకు కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్న జగన్ గడప గడపకు కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.
2024 ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో గెలవాల్సిందేనని పేర్కొన్నారు.