in ,

ప్రపంచాన్నే వెలివేసిన నార్త్ సెంటినల్స్ తెగ.

నార్త్ సెంటినల్స్

ఆ తెగ లోని ప్రజలు బాహ్య ప్రపంచంతో కలవడానికి ఇష్టపడరు, ఇప్పటికీ అసలు వారికి కనీసం వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియదంటే నమ్మగలరా.. కానీ ఇది నిజమండి, అలా ఇంకా అడివి మనుషుల రీతిలో నివసిస్తున్న వారే నార్త్ సెంటినెల్స్.

అసలు నార్త్ సెంటినెల్స్ ఎవరు?

అండమాన్ దీవులు బంగాళాఖాతంలో ఉన్న భారతీయ ద్వీపసమూహం. ఇవి 300 ద్వీపాలు తెల్లటి ఇసుక బీచ్‌లు,మడ అడవులు మరియు ఉష్ణమండల వర్షారణ్యాలకు ప్రసిద్ధి చెందినవి. ఈ దీవులలోని కొంత భాగంలో నార్త్ సెంటినెల్ అనే ఉష్ణమండల ద్వీపంలో 60 వేలా సంవత్సరాల మానవ తెగ ఇప్పటికీ జీవిస్తుంది. అలా జీవిస్తున్న వారే నార్త్ సెంటినెల్స్.

నార్త్ సెంటినెల్స్ గురించి ప్రపంచానికి తెలిసిన రోజు.

1867లో 100 మంది ప్రయాణికులు కలిగిన వ్యాపార నౌక అనుకోని ఇబ్బందుల వల్ల నార్త్ సెంటినెల్స్ ఉండే ఐలాండ్కు దగ్గరలో హఠాత్తుగా ఆగిపోయింది. దగ్గరలో వారికి తెలియని మనుషులు ఉండడం చూసిన సెంటినెల్స్ వారి దగ్గర ఉన్న బాణాలతో,ఈటెలతో ప్రయానికులపై దాడి చేయడం మొదలు పెట్టారు. అదృష్టవశాత్తు ప్రయాణికులను అటుగా వెళ్తున్న బ్రిటిష్ ఇండియా నౌకా దళం గమనించి కాపాడడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో నార్త్ సెంటినెల్స్ అనే వాళ్ళు నివసిస్తున్నారని, కానీ వారికి బయట వారితో కలవడం ఇష్టం లేదని ప్రపంచానికి తెలిసింది.

ఈ నార్త్ సెంటినెల్స్ వారితో బయట వారి అనుభవం.

1967లో మానవ శాస్త్రవేత్త త్రిలోక్నాథ్ పండిట్ 20 మంది ఎటువంటి ఆయుధాలు లేని సిబ్బందితో మరియు ఒక గవర్నర్తో కలిసి నార్త్ సెంటినెల్ ఐలాండ్కు చేరుకున్నారు. అక్కడ ఐలాండ్ లో దిగిన తరువాత త్రిలోక్నాథ్,మిగతా 20 మంది సిబ్బంది కలిసి వారికి కనిపించిన పాద ముద్రలను గమనిస్తూ దాదాపుగా 1 కిలోమీటర్ పైగా నడిచినప్పటికి వారికి ఎవరు కనిపించకపోవడంతో వారి దగ్గరున్న కొబ్బరికాయలు కొన్ని ఇనుము వస్తువులను సెంటినెల్స్ తీసుకుంటారన్న నమ్మకంతో వదిలేసి అక్కడ్నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు.

1981లో ప్రిమ్రోస్ అనే వ్యాపార నౌక బంగ్లాదేశ్ నుండి ఆస్ట్రేలియా వెళ్తుండగా

తూఫాన్ రావటం వల్ల నార్త్ సెంటినెల్ ఐలాండ్కు దగ్గరలో ఆగిపోయింది. నౌకను చూసిన సెంటినెల్స్ వారిపై దాడి చేయడం మొదలు పెట్టారు. అదృష్టవశాత్తు వీరిని కూడా కాపాడడానికి కొంతమంది రావడంతో అక్కడ నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటకి రాగలిగారు. కొంత కాలం తరువాత తెలిసిన విషయం ఏంటంటే అక్కడ వదిలేసిన నావ ఇనుమును సెంటినెల్స్ వారికి అవసరమైన విధముగా బాణాలలో మరియు వేరే వాటిలో వాడుతూ కనిపించారట. ఇప్పటికీ ఆ ప్రిమ్రోస్ నావ అక్కడ ఐలాండ్ దగ్గరే ఉందట.

సెంటినెల్స్ బయట వారితో సన్నిహితంగా ఉన్న సమయం.

1991లో మరో మానవ శాస్త్రవేత్త మధుమాల చట్టోపాద్యా తన సిబ్బందితో కలిసి నార్త్ సెంటినెల్స్ ఐలాండ్ కు చేరుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈసారి సెంటినెల్స్ బయట వారితో సన్నిహితంగా మెలుగుతూ వాళ్ళు ఇచ్చిన కొబ్బరి కాయలను,బహుమతులను కూడా తీసుకుని వెళ్ళిపోయారట. కొంత కాలం తరువాత మదుమాల,త్రిలోకనాథ్ పండిట్తో కలిసి మళ్ళీ నార్త్ సెంటినెల్ ఐలాండ్కు వెళ్ళారు. ఈ సారి కూడా సెంటినెల్స్ వారితో సన్నిహితంగా మెలుగుతూ ఆహ్వానించారు.

ఊహించని మలుపు.

నార్త్ సెంటినెల్స్ బయట వారిని ఆహ్వానించడానికి అంగీకరిస్తుండడంతో ఇకపై వారు కూడా అందరితో కలిసుంటారని అనుకున్నారంతా. కానీ కొంత కాలం తరువాత తమ దగ్గరకు వచ్చే బయటవారిని మళ్ళీ దాడి చేసి తిప్పి కొడతారని ఎవరు ఊహించలేదు. త్రిలోక్నాథ్ వాళ్ళు వెళ్లి వచ్చిన కాలం మద్యలో ఏం జరిగింది..నార్త్ సెంటినెల్స్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు..ఈ విషయాలు ఎవరికి అర్థం కాలేదు. 1991 నుంచి 1997 వరకు నార్త్ సెంటినెల్స్ వాళ్ళను కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమయ్యాయి. ఇక అక్కడున్న వారికి బయట వారితో కలవడం ఇష్టం లేకపోవడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారని ఒక ఉద్దేసానికి వచ్చిన ప్రభుత్వం ఆ నార్త్ సెంటినెల్ ఐలాండ్ను బాన్ చేసింది. ఒకవేళ ఆ ప్రాంతం వైపు వెళ్ళవలసి వస్తే ఆ ఐలాండ్కు కనీసం 5 కిలోమీటర్ల దూరాన్ని పాటించాలని ఒక వేళ దాన్ని దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తే అది నేరంగా పరిగణిస్తామని వెల్లడించింది.

ఇటీవలే చివరిగా 2018లో జాన్ ఎల్న్ చౌ నార్త్ సెంటినెల్స్ తెగ వారిని కలిసి వాళ్ళకి క్రిస్టియానిటీని పరిచయం చేద్దామని నిర్ణయించుకున్నాడు. కానీ సెంటినెల్స్ జాన్ను తిప్పికొట్టారు. మొదటి సారి వెళ్ళినప్పుడు దాడి చేసి తనను పంపేసిన సరే వారిని ఎలాగైనా మాట్లాడి మార్చితీరాలనే మూర్ఖపు పట్టుదలతో వెళ్లిన జాన్ను సెంటినెల్స్ చంపి వడ్డున ఉన్న ఇసుకలో పాతిపెట్టేసారు. ఈ సంఘటనతో వారిని ఎవరూ కలిసే ఆలోచన చేయలేదు ఆపై నార్త్ సెంటినెల్స్ కూడా బయటవారిని కలవడానికీ ముందుకు రాలేదు.

What do you think?

ఈ వంటకాలు తినాలంటే కనీసం మిలియనీర్ అయ్యుండాలి.

ఇలా జరిగితే ఇక ఈవీ వెహికల్స్ దే హవా….