in

ఇలా జరిగితే ఇక ఈవీ వెహికల్స్ దే హవా….

ఇక ఈవీ వెహికల్స్ దే హవా….

 

భారతీయ నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతున్న స్థాయి ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోని 100 అత్యంత కాలుష్య నగరాల్లో 25 కంటే ఎక్కువ భారతీయ నగరాలు ఉన్నాయి. నగరాల్లో అభివృద్ధి చెందుతున్న వాయు కాలుష్యం రవాణా రంగం నుండి ఉద్గారాలను తగ్గించడం ముఖ్యం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక ఆశాజనకమైన టెక్నాలజీ.

విద్యుత్ మొబిలిటీని పెంచడానికి, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడానికి హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన అడాప్షన్, తయారీలో 10,000 కోట్ల వ్యయం ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కోసం గ్రీన్ లైసెన్స్ ప్లేట్లను ఆమోదించింది. తెలుగు ప్రభుత్వాలు ఈ వెహికల్స్ కు అనేక ప్రోత్సాహకాలు రాయతీలు ప్రకటించాయి.

కొనాలని చాలామంది అనుకుంటారు, కానీ కొనడానికి కాస్త ఆలోచిస్తారు.
ఛార్జింగ్ ఎలా, మైంటెనెన్సు ఎలా, ఖర్చు ఎంతవుతుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది, పెట్రోల్ వాహనం బెటర్ అవుతుందా, ఈ వెహికల్ తో లాభమా. మధ్యలో ఆగిపోతే ఎం చేయాలి. ఇలా రక రకాల డౌట్స్. ఈ సమస్యలన్నిటినీ సొల్యూషన్ చూపిస్తున్నాయి తెలుగు ప్రభుత్వాలు.

కారు అదే స్పీడ్. బైక్ భలే జోరు. బస్సు అదుర్స్. సౌండ్ చేయకుండా సైలెంట్ గ దూసుకుపోతాయి. డిజైన్ అదిరిపోతోంది. కంఫర్ట్ గాను ఉంటుంది. పెర్ఫార్మన్స్ లో ఏమాత్రం కంప్రమైస్ ఉండదు. పెట్రోల్, డీజిల్ కార్ల మాదిరి కాకపోతే బాటరీతో నడుస్తుంది. అంతే మిగతా అంతా సేమ్ ట సేమ్.

పెట్రోల్ లేదా డీజిల్ వెహికల్ మైంటెనెన్సు లక్ష కి. మీ. కు రెండు నుండి మూడు లక్షలు అదే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లక్ష కి. మీ. కు. రెండు వేలు నుండి మూడు వేలు మాత్రమే. విద్యుత్ వాహనాల వలన ఇన్ని లాభాలున్నా కొనుగోలు దారుగు ఆసక్తి చూపక పోవటానికి కారణం వారిలో సరిఅయిన అవగాహన లేకపోవటమే.
ఛార్జింగ్ సమస్యను సాల్వ్ చేసేందుకు ఏ పి, తెలంగాణ ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఏ పి లో 400 ఛార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. జాతీయ రహదారుల్లో ప్రతి 25 కి. మీ. కు ఒక ఛార్జింగ్ పాయింట్ నెలకొల్పేందుకు సన్నద్ధమవుతుంది. తెలంగాణ సర్కార్ సైతం హై వే ల పై ప్రతి 50 కి. మీ. కు ఒక పవర్ పాయింట్ అందుబాటులో ఉంచబోతుంది.

హైదరాబాద్ తో పాటు జిల్లాలలో 178 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఛార్జింగ్ పాయింట్ లో ఒక కార్ ఛార్జింగ్ కు యావరేజ్ (50 కి, వాట్ ఫాస్ట్ చార్జర్ ) ఒక గంట సమయం పడుతుంది. ఇది 300 కి.మీ. ప్రయాణించడానికి పనికొస్తుంది.

ఛార్జింగ్ సమస్య దాదాపు తీరిపోయినట్టే రాయతీలు బేషుగ్గా ఉన్నాయి. మైంటెనెన్సు ఖర్చులు తక్కువే. తెలంగాణ లో విద్యుత్ వాహనాలను తయారు చేసే దిగ్గజ కంపెనీ ఏలెక్ట్రా.. హైదరాబాద్ తో పాటు ముంబై, పూణే, కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో సైతం ఎలెక్ట్రా కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. ఇవి పూర్తిగా ఏకో ఫ్రెండ్లీ. బాటరీ వెహికల్స్ లో ఇన్ని ప్రయోజనాలు ఉండడం తో ఆ దిశగా వినియోగ దారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.

బోలెడు బెనిఫిట్స్

వాహన దారులలో అవగాహన పెరిగితే ఫ్యూచరంతా ఈ వెహికల్స్ దే హవా. రిజిస్ట్రేషన్ చార్జిస్ లేవు. రోడ్ టాక్స్ కట్టనక్కర లేదు. కస్టమర్ లతో పాటు తయారీ దార్లకు మస్త్ మినహాయింపులు 200 కోట్ల పెట్టుబడికి 20 శాతం పెట్టుబడి సబ్సిడీ. ఏడేళ్ల పాటు జి ఎస్ టీ తిరిగి చెల్లింపు. ఐదేళ్ల పాటు ఐదుకోట్ల పరిమితి తో 25% విద్యుత్ సబ్సిడీ. స్టాంపుడ్యూటీ బదిలీ, రిజిస్ట్రేషన్ రుసుములనుండి మినహాయింపు ఇలా విద్యుత్ వాహనాల తయారీ సంస్థల పై వరాలజల్లు కురిపియించింది తెలంగాణ సర్కార్. అటు ఏ పి ప్రభుత్వం సైతం ఎలెక్ట్రిక్ వాహననాల ప్రోత్సహం దిశగా అనేక చర్యలు తీసుకుంటుంది.

అయితే ప్రజల్లో మార్పు రావాలి ఈ వెహికల్స్ ప్రాధాన్యతను, ప్రయోజనాలను వాహన దారులు గుర్తించాల్సిఉంది. విద్యుత్ వాహనాలపై అపోహలు తొలగాల్సి ఉంది.

అలా జరిగితే

ఉందిలే… మంచి కాలం ఈ వీ వెహికల్స్ కు ముందు ముందునా.. రై రై ఎలెక్ట్రిక్ రైడ్

What do you think?

ప్రపంచాన్నే వెలివేసిన నార్త్ సెంటినల్స్ తెగ.

ఐ పి ఓ లాస్ అండ్ గైన్ కథా కమీషు..