in

ట్విట్టర్ లో వీడియో కాలింగ్‌ వంటి మరిన్ని కొత్త ఫీచర్లు

ట్విట్టర్ లో వీడియో కాలింగ్ వంటి మరిన్ని కొత్త ఫీచర్లు

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్నన్నప్పటి నుండి ఆ యాప్ రూపురేఖలే మారిపోయాయి. ట్విట్టర్ బ్లూ, ట్వీట్స్ ఎడిట్, రీడింగ్ మోడ్ ఇలా ఎలోన్ ట్విట్టర్ లో రకరకాల ఫీచర్స్ ను ట్విట్టర్ కు ఆడ్ చేశారు. ఇటీవల దాని లోగోను కూడా “X” కింద మార్చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఎలోన్ మస్క్ ట్విట్టర్ కు మరిన్ని కొత్త ఫీచర్లను యాడ్ చేయనున్నారు.

ట్విట్టర్ యూజర్లకు త్వరలో వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ లిండా యాకరినో స్వయంగా ప్రకటించారు. ఈ వీడియో కాలింగ్‌ ఫీచర్ తో పాటు డిజిటల్‌ చెల్లింపులు, కంటెంట్‌ క్రియేటర్‌ సబ్‌స్క్రిప్షన్‌, ఎక్కువ నిడివి ఉన్న వీడియోల పోస్టింగ్‌ వంటి మరిన్ని ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఈవో లిండా  తెలిపారు.

What do you think?

చిన్నారి చనిపోయింది చిరుత దాడిలో కాదు

రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం