in

చిన్నారి చనిపోయింది చిరుత దాడిలో కాదు

చిన్నారి చనిపోయింది చిరుత దాడిలో కాదు

చిరుత దాడిలో చిన్నారి చనిపోయిందని భావిస్తున్న కేసు మలుపు తిరిగింది. ఆమె చిరుత దాడిలో చనిపోలేదని తేలింది.

తిరుమలలో 6 ఏళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో చనిపోదని, తనపై దాడి చేసింది ఎలుగుబంటి అని అటవీశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై టీటీడి డీఎఫ్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ‘పాప ఒక్కతే వెళ్తున్న సమయంలో ఎలుగుబంటి ఎత్తుకెళ్లినట్టుగా అనుమానం ఉంది. పాప మెట్ల మార్గంలో కాకుండా పక్కకు వెళ్ళిన కారణంగా ఎలుగుబంటి దాడి చేసినట్లు తెలుస్తోంది. పాప మృత దేహం వద్ద లభించిన ఆనవాళ్ల దృష్ట్యా ఈ అభిప్రాయానికి వచ్చాం. పోస్టుమార్టం నివేదిక వస్తే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది’ అని  తెలిపారు.

What do you think?

ఇన్‌స్టా ఒక్కో పోస్ట్ కి 11 కోట్లు తీసుకుంటున్న కోహ్లీ

ట్విట్టర్ లో వీడియో కాలింగ్‌ వంటి మరిన్ని కొత్త ఫీచర్లు