in

కార్డు, ఫోన్ అవసరం లేకుండానే ఫ్యూయల్ చెల్లింపులు

కార్డు, ఫోన్ అవసరం లేకుండానే ఫ్యూయల్ చెల్లింపులు

డిజిటల్ పే రాక ముందు చేతిలో డబ్బు లేకపోయినా లేదా డబ్బును ఇంట్లో మర్చిపోయినా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తరువాత ఏదైనా కొనుగోలు చేయడం సులభం అయిపోయింది. చేతిలో కార్డు ఒక్క స్వైప్ తోనో/ ఒక ట్యాప్ తోనో సులువుగా పేమెంట్ అయిపోతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక్క స్కాన్ చేస్తే చాలు డబ్బులు వెళ్లిపోతాయి. అయితే ఇప్పుడు ఈ రెండూ లేకపోయినా మీ కారు నుంచే పెట్రోల్ బంకుల్లో ఇకపై చెల్లింపులు చేసే పద్దతి వస్తుంది. దీని ద్వారా ఫాస్టాగ్ (fastag) రీఛార్జి కూడా చేసుకోవచ్చు.

విషయం ఏంటంటే అమెజాన్, మాస్టర్ కార్డు మద్దతు ఉన్న టోన్ ట్యాగ్ అనే సంస్థ తాజాగా ‘పే బై కార్’ అనే కొత్త డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఆవిష్కరించింది. యూపీఐ సపోర్ట్ తో ఇది పనిచేస్తుంది. ఇటీవల గ్లోబల్ ఫిస్టాక్ ఫెస్ట్ లో ఎన్ పీసీఐతో కలిసి యూపీఐలో కన్వర్జేషనల్ పేమెంట్ల సిస్టమ్ ను టోన్ ట్యాగ్ ఆవిష్కరించింది. అంటే స్మార్ట్ఫోన్ గానీ, కార్డుగానీ అవసరం లేకుండా కేవలం కారు ఇన్ఫోటైన్మెంట్ నుంచే చెల్లింపులు చేయొచ్చు. ఇటీవల ఎంజీ హెక్టార్, భారత్ పెట్రోలియంతో కలిసి ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. పెట్రోల్ బంక్ కు వెళ్లినప్పుడు మీ కారులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫ్యూయల్ డిస్పెన్సర్ నంబర్ ను డిస్ప్లే చేస్తుంది. పెట్రోల్ బంక్ కు రాగానే మీకు అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అటు పెట్రోల్ బంక్ సిబ్బందినీ అలర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారా మీకు ఎంత ఫ్యూయల్ కావాలో ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ సదుపాయంతో ‘ఫాస్టాగ్’ రీఛార్జి కూడా చేసుకోవచ్చు. చెల్లింపుల అనంతరం మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో కూడా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

What do you think?

మొరాకోలో భూకంపం. 2 వేల వేల మంది మృతి

చంద్రబాబును చంపే ప్రయత్నం జరుగుతోంది – ఎంపీ రఘు రామకృష్ణ