in

ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే తీసుకోవద్దని పిల్లలకి ఇందుకే చెబుతారు – మాటల వెనుక కథ

ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే తీసుకోవద్దని పిల్లలకి ఇందుకే చెబుతారు – మాటల వెనుక కథ

తల్లిదండ్రులు పిల్లలకి “ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే తీసుకోవద్దు” అని చెప్పడం చూస్తూ ఉంటాం. అయితే ఈ మాటలు వాళ్ల చాదస్తం వల్లనో, అతి జాగ్రత్త వల్లనో చెబుతున్నారని అనుకుంటుంటాం. కానీ వాళ్లు చెప్పే ఈ మాటల వెనకాల ఓ కారణం. ఓ నిజమైన కథ ఉంది.

1874, జూన్ లో ఫిలడెల్ఫియాలోని జర్మన్‌టౌన్ ప్రాంతంలో ఒక బండిలో ఓ వ్యక్తి పిల్లలకు చాక్లెట్స్ (chocolates) పంచాడు.

కట్ చేస్తే ఒక నెల తరువాత జూలై 1న, చార్లీ అనే ఓ చిన్న పిల్లాడు కనపడకుండా పోయాడు. చార్లీ మిస్ అయిన విషయం గురించి చార్లీ సోదరుడు వాల్టర్ ని అడిగితే ” ఎందుకు? అయినా చార్లీ బండిలో బాగానే ఉన్నాడు.” అంటూ సమాధానం ఇచ్చాడు.

పొలీసులు వాల్టర్ ను మరింత ఇన్వెస్టిగేషన్ చేసిన తరువాత చార్లీకి ఎవరో చాక్లెట్స్ ఆశ చూపించి వాళ్ళని నమ్మేలా చేశారని, ఆ తరువాత చార్లీని కిడ్నాప్ చేశారని తెలుసుకున్నారు. చార్లీని కనిపెట్టడానికి 5 నెలలు ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈ సమయంలో చార్లీ కుటుంబానికి కిడ్నాపర్‌ల నుండి 23 లేఖలు వచ్చాయి. 600 కంటే ఎక్కువ మంది పిల్లలను చార్లీ అనుకుని పొరపాటు పడ్డారు. ఆ తరువాత కూడా చార్లీ కోసం చాలా కాలం ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి. కానీ అతని ఆచూకీ తెలియలేదు. ఇప్పటికీ తను ఏమయ్యాడు అనేది ఓ మిస్టరీ గానే మిగిలిపోయింది.

అందుకే ఇప్పటికీ చిన్న పిల్లలకు తల్లిదండ్రులు ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే తీసుకోవద్దని చెబుతుంటారు.

What do you think?

2023 ఆసియా కప్ భారత జట్టులో తెలుగు కుర్రాడు

టెండూల్కర్ ను నేషనల్ ఐకాన్ గా నియమించనున్న ఎన్నికల కమిషన్