in ,

అమేజింగ్ & మిస్టీరియస్ మౌంటైన్స్ ఆఫ్ ది వర్ల్డ్!

అమేజింగ్ & మిస్టీరియస్ మౌంటైన్స్ ఆఫ్ ది వర్ల్డ్

 

1.రెయిన్బో మౌంటైన్స్ : చైనా

చైనాలోని జాంగ్యే డాన్‌క్సియా ల్యాండ్‌ఫార్మ్ జియోలాజికల్ పార్క్‌లోని రెయిన్‌బో పర్వతాలు ప్రకృతి కళాకృతిలా అనిపిస్తాయి! ఈ శిఖరాలు అనేక వందల మీటర్ల పొడవు మరియు ప్రత్యేకమైన ఇంద్రధనస్సు షేడ్స్ కలిగి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తాయి.

 

2.మౌంట్ కినాబాలు : మలేషియా

మౌంట్ కినాబాలు అత్యంత ప్రముఖమైన మరియు అత్యంత జీవశాస్త్ర వైవిధ్యమైన ప్రదేశాలలో ఒకటి. ఈ పర్వతం బోర్నియో ద్వీపంలో మలేషియాలోని కినాబాలు నేషనల్ పార్క్‌లో ఉంది. పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతం అనేక ఒరంగుటాన్‌లకు నిలయం.

 

3.మౌంట్ సినాయ్ : ఈజిప్ట్

ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో ఈ పర్వతం ఉంది. దీనికి జబల్ మూసా మరియు మౌంట్ మోసెస్ అని పేర్లు కలవు, ఈ పర్వతంపై మోషే పది ఆజ్ఞలను అందుకున్నాడని నమ్ముతారు. భగవంతుడు దర్శనమిస్తాడని విశ్వసించే అత్యంత పవిత్రమైన ప్రదేశం కాబట్టి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఈ పర్వతాన్ని సందర్శిస్తారు.

 

4.మౌంట్ తారానాకి : న్యూజిలాండ్

2518 మీటర్ల ఎత్తులో ఉన్న తారానాకిని పర్వతం సమీపంలో నివసించే గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. మావోరీ పురాణంలో, తారానాకిని శాంతియుత పర్వతంగా పరిగణిస్తారు. పర్వతానికి దగ్గరగా ప్రవహించే అందమైన నది ఈ ప్రాంతాన్ని మనుషులు మరియు జంతువులకు నివాసయోగ్యమైనదిగా చేస్తుంది.

 

5.మౌంట్ కైలాష్ : అటానమస్ రీజియన్ ఆఫ్ చైనా

కైలాష్ పర్వతం బహుశా ప్రపంచంలోని అత్యంత రహస్యమైన పర్వతాలలో ఒకటి! ఈ 6638 మీటర్ల ఎత్తైన పర్వతం అపారమైన మతపర ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పర్వతంగా పరిగణించబడుతుంది. ఇప్పటివరకు ఎవరూ ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోయారు ఇక ఇప్పుడు కైలాష్‌పై ఎక్కడం నిషేధించబడింది.

 

6.మౌంట్ ఫుజి : జపాన్

ఫుజి పర్వతం జపాన్‌లోని ఎత్తైన మరియు అత్యంత పవిత్రమైన పర్వతం. 3776 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతానికి ‘ఫుచి’ అనే బౌద్ధ అగ్ని దేవత పేరు పెట్టారు. జపనీస్ బౌద్ధులు ఈ పర్వతం మరొక ప్రపంచానికి పోర్టల్ అని నమ్ముతారు.

 

  1. బంగిల్ బంగిల్ రేంజ్ : ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలోని పూర్ణులులు నేషనల్ పార్క్‌లో గల ఈ ఎత్తైన గోపురం ఆకారపు శ్రేణులు చూడటానికి పెద్ద తేనెటీగలు లాగా కనిపిస్తాయి. ఈ శిఖరాలు చాలా పెళుసుగా ఉండటం వలన వీటి పైకి ఎక్కడం నిషేధించబడింది!

What do you think?

అప్పు మీ జీవితానికే కాదు,ప్రాణాలకు కూడా ప్రమాదమే!

అర్ధం లేని రష్యా – ఉక్రెయిన్ వార్… అంతమెప్పుడో!