in

కూతుర్ని హీరోయిన్ చేయాలని ఇంజెక్షన్ ఇచ్చిన తల్లి!

కూతుర్ని హీరోయిన్ ను చేయాలని ఇంజెక్షన్లు ఇచ్చిన తల్లి!

ఓ తల్లి తన కూతుర్ని హీరోయిన్ చేయాలనే ఉద్దేశంతో ఇంజెక్షన్ లు ఇచ్చింది. ఈ విషయం తెలిసిన చైల్డ్ లైన్ అధికారులు బాలికను ఆధీనంలోకి తీసుకుని స్వధార్ హోమ్‌కు తరలించారు.

 

వివరాల్లోకి వెళ్తే విశాఖకు చెందిన ఓ మహిళ తన 15 ఏళ్ల కూతుర్ని హీరోయిన్ చేయాలనే ఉద్దేశంతో కూతురుకు ఇంజెక్షన్ ఇచ్చి త్వరగా పెద్దదాన్ని చేయాలనుకుంది.

ఈ క్రమంలో కూతురికి తరచూ ఇంజక్షన్‌లు ఇస్తూ ఇబ్బంది పెట్టింది. ఆ బాధను భరించలేని చిన్నారి చైల్డ్‌ లైన్ విభాగానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాలికను అధీనంలోకి తీసుకుని స్వధార్ హోమ్‌ కు తరలించారు. బాలల హక్కు పరిరక్షణ కమిటీ ఈ దారుణానికి వడికట్టిన తల్లి పై కేసు నమోదు చేయాలని కోరింది.

What do you think?

ఏపీలో ఏపీ ఫైబర్ ‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’ ప్రారంభం!

‘ఈ దుర్ఘటనకు కారణమైన వారిని వదిలేది లేదు’ – మోదీ