in

ఏపీలో ఏపీ ఫైబర్ ‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’ ప్రారంభం!

ఏపీలో ఏపీ ఫైబర్ నెట్ ‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’ ప్రారంభం!

‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’ కార్యక్రమాన్ని ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ ‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’ కార్యక్రమంలో మొదటి సినిమాగా ‘నిరీక్షణ’ మూవీని రిలీజ్ చేశారు.

 

వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ ఫైబర్ నెట్‌లోని ‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’ కార్యక్రమాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. మొదటి సినిమాగా ‘నిరీక్షణ’ మూవీని రిలీజ్ చేశారు.

కాగా.. ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కొత్త సినిమాలను రిలీజ్ అయిన రోజే ఇంటి దగ్గర ఉండి వీక్షించొచ్చు. ఏజెన్సీ, మారుమూల గ్రామల ప్రజలకు దీని ద్వారా వినోదం అందుతుంది.

అయితే ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఏపీ ఫైబర్ నెట్‌లోని ఈ ‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తుండగా.. థియేటర్లు దొరక్క ఇబ్బంది పడుతున్న చిన్న నిర్మాతలకు ఈ సేవలు చాలా మేలు చేస్తాయి కానీ ఏపీలో దీని వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి నష్టం జరగదని అమర్నాథ్ అన్నారు.

What do you think?

లోకేశ్ పై గుర్తు తెలియని వ్యక్తుల కోడిగుడ్ల దాడి!

కూతుర్ని హీరోయిన్ చేయాలని ఇంజెక్షన్ ఇచ్చిన తల్లి!