in

లోకేశ్ పై గుర్తు తెలియని వ్యక్తుల కోడిగుడ్ల దాడి!

లోకేశ్ పై గుర్తు తెలియని వ్యక్తుల కోడిగుడ్ల దాడి!

ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరులో ఈ ఘటన చోట చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరులో ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ బహిరంగ సభ అనంతరం మైదుకూరు రోడ్డుమార్గంలో యువగళం పాదయాత్ర సాగించారు. ఈ క్రమంలో లోకేశ్ పై ఓ వ్యక్తి కోడిగుడ్డు విసిరాడు. అయితే ఆ కోడిగుడ్డు అక్కడి భద్రతా సిబ్బందికి తగిలింది. దీంతో టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్డు విసిరిన ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
కాగా.. ఈ ఘటన అనంతరం లోకేశ్ అక్కడే కూర్చుని దీనిపై నిరసనకు దిగారు.

What do you think?

192 బిలియన్ డాలర్లతో ఎలోన్ మళ్ళీ మొదటి స్థానానికి!

ఏపీలో ఏపీ ఫైబర్ ‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’ ప్రారంభం!