in

‘ఈ దుర్ఘటనకు కారణమైన వారిని వదిలేది లేదు’ – మోదీ

‘ఈ దుర్ఘటనకు కారణమైన వారిని వదిలేది లేదు’ 

ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288 చేరింది. గాయపడిన వారి సంఖ్య 800 చేరింది.

ఒడిశా, బాలాసోర్ జిల్లాలో జరిగిన మూడు రైళ్ల దుర్ఘటన గురించి తెలిసిన విషయమే. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(12841) షాలిమార్ నుంచి చెన్నై వెళ్తుండగా బాలాసోర్ జిల్లాలోని బహనాగా స్టేషన్ సమీపంలో ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 బోగీలు పట్టాలు తప్పగా.. వీటిలో నాలుగు బోగీలు పూర్తిగా తలకిందులయ్యాయి.

అయితే అధికారులు మరోరకమైన ప్రకటన ఇచ్చారు. కోరమండల్ రైలు బోగీలు పట్టాలు తప్పిన తర్వాత ఆ బోగీలను యశ్వంత్‌పూర్- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ డీకొట్టినట్లుగా చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మరణించగా.. 800 మంది గాయపడ్డారు.
కాగా అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? దీనికి కారణం ఏంటి? అన్న విషయాల పై ఇంకా పూర్తి సమాచారం రావల్సి ఉంది.

మరో వైపు ప్రధాన మంత్రి మోదీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. యూనియన్ రైల్వే మినిస్టర్ అష్విని వైష్ణవ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి బాలాసోర్ జిల్లాలోని ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మోదీ ఇది అత్యంత బాధాకరమైన ఘటనని అన్నారు. గాయపడిన వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ పడుతుందని తెలిపారు. ఈ ఘటనను అన్ని కోణాల నుంచి విచారిస్తున్నామని, దీనికి కారణమైన వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు.

ఘటనా స్థలంలో కేబినెట్ సెక్రెటరీ, హెల్త్ మినిస్టర్ తో మాట్లాడిన ఆయన గాయపడిన వారికి, వారికి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ పడాలని, వారికి అవసరమైనవి అందించాలని ఆదేశించారు.

What do you think?

కూతుర్ని హీరోయిన్ చేయాలని ఇంజెక్షన్ ఇచ్చిన తల్లి!

రైలు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు