in ,

మన మనిషి.. మంచిమనిషి …ఎమ్మెల్యే కేతిరెడ్డి

మన మనిషి.. మంచిమనిషి …ఎమ్మెల్యే కేతిరెడ్డి

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజక వర్గం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. అటువంటి స్తానం నుండి రెండు సార్లు ఎం ఎల్ ఏ గ గెలిచిన కేతిరెడ్డి వినూత్న పంధా లో దూసుకుపోతున్నారు.

ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజారంజన పాలన అందించాలన్న లక్ష్యం తో సాగుతున్న ఆ మేటి నాయకుడు ధర్మవరం ఎంల్ ఏ కేతిరెడ్డి. ప్రజలవద్దకె పాలన అన్న నినాదం, వాగ్దానాల రూపం లో మిగిలేదే కానీ ముందుకు సాగేది కాదు. కానీ రత్నాల సీమ రాయలసీమ లో ఆ వాగ్దానాన్ని నిజం చేసి చూపిస్తున్నారు. నాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని అయన తనయుడు సి ఎం జగన్ ఆదర్శవంతమైన పాలనకు నిదర్శనం ఆ ప్రజాసేవకుడు
గుడ్ మార్నింగ్ ధర్మవరం తో, ఇటీవలి కాలం లో సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్ లో బాగా వైరల్ అవుతున్న పేరు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

ఎన్నికలకు ముందు ప్రజల గడపల వద్ద ఓట్ల కోసం. పడిగాపులు కాయడం, నోట్లతో ఫీట్ లు సర్వసాధారణం. గెలిచిన అనంతరం దుకాణం సద్దుకుని నియోజకవర్గానికి దూరం వందల కిలోమీటర్ ల లో ఉండడం నేటి నాయకుల లక్షణం అడపా దడపా నియోజక వర్గ ప్రజలపై కపట ప్రేమను వలకపోస్తూ హడావుడి చేసి సాయంత్రానికి కనుమరుగవటం ప్రస్తుత రోజుల్లో ఇటువంటి నాయకులు కోకొల్లలు.

అటువంటి పరిస్థితులు ధర్మవరం లో మారాయి. ప్రజాతీర్పును శిరసా వహిస్తూ దర్మం తప్పకుండ పాలన అందిస్తూ ప్రజల మన్నలను అందుకుంటున్నారు కేతిరెడ్డి ధర్మవరం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ ఆదర్శం,కానీ కేతిరెడ్డి మాత్రం నిరంతరం ప్రజలతో మమేకమై సమస్యల మూలాలను గ్రౌండ్ లెవెల్ కెళ్ళి తెలుసుకోవడం, ప్రజా వినతులను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేలా ప్రజలవద్దకు పాలన కు శ్రీకారం చుట్టారు కేతిరెడ్డి. మొదటి నుంచి నియోజకవర్గంలో తిరగడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు. తన మార్నింగ్ వాక్ ను కూడా ప్రజాసమస్యలకే కేటాయిస్తూ పాలకులను, అధికారులను సమన్వయపరుస్తూ సాగుతున్నారు.

ప్రజలను పేరు పెట్టి పిలవకుండా అక్క, అన్న, బాబాయ్, అంటూ ఆప్యాయం గ వరుసలతో పిలుస్తూ ప్రజలలో మమేకం అవుతున్నారు. ఎం ఎల్ ఏ అంటే స్వంత మనిషి, మన మనిషి అనిపించుకుంటున్నారు.

సామాన్య పౌరులు, నెటిజెన్ లు ఎం ఎల్ ఏ కేతిరెడ్డి చేస్తున్న పనులకు ఫిదా అవుతున్నారు. ఇటీవలికాలం లో సోషల్ మీడీయా లో ఇంతటి ఆదరణ దక్కించుకున్నవాళ్ళు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ యువ నాయకుడిగా కేతిరెడ్డి సత్తాచూపుతున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతమంటేనే తెలుగుదేశానికి పెట్టనికోట 2019 లో వై ఎస్ ఆర్ సి పి తరపున కేతిరెడ్డి విజయం సాధించారు. ఇలాంటి నియోజకవర్గం లో కేతిరెడ్డి తొలిసారి వై సి పి జండా ఎగురవేశారు. రెండవసారి విజయం సాధించినప్పటినుండి కేతిరెడ్డి అనునిత్యం ప్రజలలో మమేకమై పార్టీని, ప్రజలను అనుసంధానిస్తూ ముందుకు నడుస్తున్నారు. ముందు ముందు కూడా ఎం ఎల్ ఏ కేతిరెడ్డి అనేక మంచి పనులు చేస్తూ, మంచి పాలనను అందిస్తూ ఆదర్శ నాయకత్వానికి పునాదులు వేయాలని ఆశిద్దాం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రెండుసార్లు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించిన జగన్ వచ్చే ఎన్నికల్లో పార్టీ టార్గెట్ ఎంటో వాళ్లకి స్పష్టం చేశారు.

జగన్ సర్కార్ చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు నిరసన సెగ తగులుతోంది. ఇన్నేళ్ల తరువాత గుమ్మం తొక్కుతున్న నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. ఓవైపు నిలదీస్తున్నా సరే.. సమస్యలు వినకుండా వెళ్లిపోతున్న ప్రజాప్రతినిధులపై తిట్ల దండకం అందుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ నేతలకు ఒకేరకమైన చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

దాదాపు 70 మంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేపై వారి వారి నియోకవర్గాల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని జగన్ అనుకున్నట్లు జరిగితే నవంబర్లో అసెంబ్లీ రద్దు చేసి వచ్చే ఏడాది మార్చికి ఎన్నికలు ఉండేలా జగన్ ప్లాన్ చేస్తోన్నారు. ముందస్తు ఎన్నికలకు సమయం పెద్దగా లేకపోవడంతో వీళ్లకి వారివారి నియోకవర్గాల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే ఎన్నికల్లో వారి స్థానాల్లో కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తానని జగన్ కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ 70 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోనే వారి నియోకవర్గాల్లో ఉండి తమ గ్రాఫ్ పెంచుకొని చూపించాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరోవైపు అప్పటి వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోతే వారి సమక్షంలోనే వారి స్థానంలో కొత్త నాయకులకు అవకాశం జగన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ నిర్ణయాన్ని నేరుగా జగనే ప్రకటించనున్నట్లు సమాచారం. “మీకు గతంలో ఉన్న ఆశించినంతగా పని చేయలేదు… ఆ విషయం నాకు తెలుసు అందేకే ఆయన స్థానంలో ఇతనికి అవకాశం ఇస్తున్నాను గెలిపించండి మీకు అన్ని విధాల అండగా ఉంటాడు” అనే నినాదంలో జగన్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

What do you think?

హలో ఫిల్మీ పీపుల్ జర భద్రం !మాటలు నమ్మారంటే అంతే..

“ది కేరళ స్టోరీ”  సినిమాపై స్పందించిన ఆర్జీవీ..