in

చిన్నారికి రూ.6.5 కోట్లు చెల్లించిన మెక్డొనాల్డ్స్

చిన్నారికి రూ.6.5 కోట్లు చెల్లించిన మెక్డొనాల్డ్స్

ఓ చిన్నారికి వేడి వేడి చికెన్ నగ్గెట్స్ సర్వ్ చేసి నందుకు మెక్ డొనాల్డ్స్ కు కోర్టు 6.5 కోట్ల ఫైన్ విధించింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఒలివియా కరబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019 లో ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ డేల్ కు సమీపంలో ఉన్న మెక్డొనాల్డ్స్ డ్రైవ్ ఇన్ కు వెళ్లి హ్యాపీ మీల్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారమే మెక్డొనాల్డ్స్ వాళ్ళు హ్యాపీ మీల్ ను ఆ చిన్నారికి సర్వ్ చేశారు. అయితే ఆ చిన్నారి హ్యాపీ మీల్ ను కారులో తినేందుకు ప్రయత్నించగా వేడిగా ఓ నగెట్ తన కాలుపై పడి ఆమెకు స్వల్ప గాయం అయ్యింది. దీంతో ఆ చిన్నారి ఒక వైపు బాధతో, మరో వైపు భయంతో చాలా ఏడుస్తూనే ఉంది. చిన్నారి బాధను చూసిన కుటుంబ సభ్యులు కోర్టులో మెక్డోనాల్డ్స్ పై కేసు ఫైల్ చేశారు. గాయం అయిన కొన్ని ఫోటోలను, చిన్నారి బాధతో ఏడుస్తున్న రికార్డింగ్స్ ను కోర్టుకు అందించారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు చిన్నారి బాధకు కారణం అయినందుకు నాలుగు లక్షల డాలర్లు, తన భవిష్యత్ కు మరో నాలుగు లక్షల డాలర్లు చెల్లించాలని మెక్ డోనాల్డ్స్ ఆదేశించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 6.5 కోట్లు అనమాట.

అయితే మెక్డోనాల్డ్స్ నియమించుకున్న న్యాయవాది ఆ చిన్నారి కొంత సేపటి తరువాత ఏడుపు ఆపేసిందని, ఇప్పటికీ మెక్ డోనాల్డ్స్ హ్యాపీ మీల్ తింటుందని చెబుతూ ఆమెకు 1.56 లక్షల డాలర్లు సరిపోతాయని వాదించాడు. కానీ కోర్టు ఈ వాదన పట్టించుకోకుండా 8 లక్షల డాలర్లు చిన్నారికి చెల్లించాల్సిందే అని ఆదేశించింది.

What do you think?

ప్రేక్షకులకు సారీ చెప్పిన ‘బేబీ’ సినిమా దర్శకుడు

పవన్ పై విచారణకు జోవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం