in

పవన్ పై విచారణకు జోవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

పవన్ పై విచారణకు జోవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

పవన్

కళ్యాణ్ కొన్ని రోజుల కిందట గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశిస్తూ జీవో 16 ను జారీ చేసింది.

‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ జూలై 9న ఏలూరులో వారాహిపై బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన గ్రామం/వార్డు వాలంటీర్ వ్యవస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

29,000 మంది మహిళలు తప్పిపోవడానికి వాలంటీర్లే కారణమని, ఏపీలో ఎన్‌సీఆర్‌బీ డేటాను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్, సంక్షేమ పథకాల పేరుతో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వారికి సంభందించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని, వాలంటీర్ల ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన వాలంటీర్ సిస్టమ్/ నెట్‌వర్క్ మానవ అక్రమ రవాణాలో పాల్గొంటుందని, ఆ డేటాను పొందిన వాలంటీర్లు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని అక్రమ రవాణాలోకి నెట్టారని ఆరోపించారు.
తప్పిపోయిన 29,000 మంది మహిళల్లో 14,000 మంది మాత్రమే పోలీసులచే గుర్తించబడ్డారని, మిగిలిన 16,000 మంది జాడ తెలియలేదని పవన్ అన్నారు.

దీంతో గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థపై చేసిన ఈ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గురువారం జారీ చేసిన GO-Rt 16 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 199 (4) (బి) ప్రకారం పవన్ కళ్యాణ్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతిని మంజూరు చేసింది. గ్రామ/వార్డు వాలంటీర్లపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గానూ న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదును దాఖలు చేయనున్నారు.

కాగా జూలై 9న ఏలూరులో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అవమానకరమైన, విషపూరితమైన ప్రకటనలు చేశారని జీవో 16 పేర్కొంది.

గ్రామస్థాయి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే ఏపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ అడుగుజాడల్లో గ్రామ/వార్డు వ్యవస్థను అమలు చేసేందుకు వినూత్న విధాన నిర్ణయం తీసుకుందని జీఓ వివరించింది. ప్రభుత్వ సేవలు, సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలను పేదలకు వారి ఇంటి వద్దకే అందించడమే గొప్ప లక్ష్యమని.. పవన్ కళ్యాణ్ వాస్తవాలను అటకెక్కించారని పేర్కొంది.

ఆయన చేసిన వ్యాఖ్యలు వాలంటీర్ వ్యవస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించడంతో పాటు మహిళల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తుందని జీవో పేర్కొంది.

What do you think?

చిన్నారికి రూ.6.5 కోట్లు చెల్లించిన మెక్డొనాల్డ్స్

రిటైర్మెంట్ ప్రకటించిన లంక క్రికెటర్ తిరుమాన్నే