in

ముసలిని పెళ్లి చేసుకున్న మెక్సికో మేయర్.ఎందుకంటే..

ముసలిని పెళ్లి చేసుకున్న మెక్సికో మేయర్. ఎందుకంటే..

 

మెక్సికోలోని ఓ మేయర్ ముసలి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది.

ఇంటర్నేషనల్: వివరాల్లోకి వెళ్తే మెక్సికోలోని శాన్‌ పెడ్రో హువామెలులా పట్టణ మేయర్‌ విక్టర్‌ హ్యూగో సోసా చొంటల్‌, హువే అనే రెండు సమూహాల మధ్య శాంతి కొనసాగాలనే ఉద్దేశంతో అలీసియా ఆడ్రియానా అనే ఆడ ముసిలిని పెళ్లాడారు. ఈ వేడుకకు ముందు ప్రజలు మొసలిని తమ ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక నృత్యం చేస్తారు. తరువాత మొసలిని పెళ్లి వస్త్రాలతో అలంకరిస్తారు. అనంతరం ముసలితో పెళ్ళి జరుగుతుంది.అక్కడ ప్రజలు పెళ్లికుమారుడిని చొంటల్‌ రాజుగా, మొసలిని రాణిగా భావిస్తారు.

దీనికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది నెట్టింట వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది.

What do you think?

గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న..

ఇక ట్విట్టర్ లో అన్ని పోస్టులు చూడలేరు.షాక్ ఇచ్చిన మస్క్