in

ఇక ట్విట్టర్ లో అన్ని పోస్టులు చూడలేరు.షాక్ ఇచ్చిన మస్క్

ఇక ట్విట్టర్ లో అన్ని పోస్టులు చూడలేరు. షాక్ ఇచ్చిన మస్క్

 

ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ ట్విట్టర్ యూజర్లకు షాక్ ఇచ్చారు. యూజర్లు వీక్షించగలిగే ట్వీట్లకు లిమిట్ పెట్టామని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో నిరంతరం ట్విట్టర్ లో ట్వీట్లు పెడుతూ హస్ట్ టాగ్స్ తో టాపిక్లను ట్రెండ్ చేస్తూ ఉండే వాళ్లు ఆందోళన చెందుతున్నారు.

అసలు విషయం ఏంటంటే శనివారం (జూలై 1) రాత్రి ట్విట్టర్ యూజర్లకు అంతరాయం కలిగింది. చాలా మంది యూజర్లు ట్వీట్స్ ఓపెన చేస్తుంటే వారికి ‘రేట్ లిమిట్ ఎక్సీడెడ్’ , ‘కెనాట్ రీట్రైవ్ ట్వీట్స్’ అని సందేశాలు దర్శనమిచ్చాయి. దీంతో నిరంతరం ట్విట్టర్ వాడే వారు ఆందోళనతో #twitterdown (#ట్విట్టర్ డౌన్) అంటూ హాస్ట్ టాగ్ ట్రెండ్ చేశారు. దీనికి ఎలోన్ మస్క్ స్పందిస్తూ యూజర్లు స్పందిస్తూ షాక్ ఇచ్చారు. ట్వీట్ చేసి అసలు విషయం చెప్పారు.

డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ల సమస్యలను పరిష్కరించేందుకు తాత్కాలిక పరిమితులను తీసుకొచ్చినట్లు మస్క్ వివరించారు. యూజర్లు ట్విటర్ కు బానిసయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయని.. దాని నుంచి బయటపడాల్సిన అవసరముందని.. తాను ప్రపంచానికి మంచి చేస్తున్నాను అని అంటూ దీన్ని సమర్థించుకున్నారు.

రోజూ యూజర్లు పోస్టులను వీక్షించే సంఖ్యను పరిమితం చేస్తునట్లు తెలిపిన మస్క్ వెరిఫైడ్ అకౌంట్ల యూజర్లు 6వేలు, అన్ వెరిఫైడ్ అకౌంట్ల యూజర్లు 600, కొత్త అన్ వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు 300 పోస్టులు వీక్షించవచ్చని పేర్కొన్నారు.

అయితే ఈ పరిమిత పోస్టుల సంఖ్యను రానున్న రోజుల్లో పెంచుతామని ఎలోన్ అన్నారు. అప్పుడు వెరిఫైడ్ అకౌంట్ల యూజర్లు 8వేలు, అన్ వెరిఫైడ్ అకౌంట్ల యూజర్లు 800, కొత్త అన్ వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు 400 పోస్టులు వీక్షించవచ్చని  అన్నారు.

What do you think?

ముసలిని పెళ్లి చేసుకున్న మెక్సికో మేయర్.ఎందుకంటే..

పెళ్ళి కాని వారికి పింఛను ఇవ్వనున్న హరియాణా సీఎం