in

ఒక్కడే 12 ఏళ్లు కష్టపడి భూగర్భంలో మేడ కట్టాడు.

ఒక్కడే 12 ఏళ్లు కష్టపడి భూగర్భంలో మేడ కట్టాడు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి భూగర్భంలో రెండంతస్తుల మేడ కట్టాడు. దీనికోసం పన్నెండేళ్లు కష్టపడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని హర్దోయీకి చెందిన ఇర్ఫాన్ అలియాస్ పప్పుబాబా దిల్లీలో పనిచేసుకుంటుండే వాడు. అయితే ఇర్ఫాన్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి గ్రామానికి వచ్చాడు. కానీ దురదష్టవశాత్తూ ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. దీంతో నిరాశ చెందిన అతను కొన్నాళ్లు మళ్లీ గ్రామానికి దూరమయ్యాడు.
అయితే ఆ తరువాత కొన్నాళ్ళకి ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఇర్ఫాన్ గ్రామానికి తిరిగి వచ్చాడు. తను అనుకున్న విధంగానే 2011 ఇంటి నిర్మాణం మొదలు పెట్టాడు. ఈ పనుల్లో నిమగ్నమైనప్పుడు భోజనం చేసేందుకు మాత్రమే కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేవాడు. ఇర్ఫాన్ ఖుర్పా (చిన్న పార లాంటిది) సాయంతో పాతకాలంలో మాదిరిగా అండాకారంలో ఇంటిగోడలను చెక్కాడు. ప్రార్థన మందిరం, డ్రాయింగ్ రూం.. ఇలా అన్ని సదుపాయాలు ఉండేలా 11 గదులతో ఇర్ఫాన్ ఆ ఇల్లును నిర్మించాడు. పైకి బంకర్ లా కనిపించే ఈ ఇంటిని తన కుటుంబానికి జీవనాధారమైన పొలంలోని మట్టితో కట్టాడు.

ఇర్ఫాన్ కట్టిన ఈ ఇంటిని చూసిన స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామస్థులు మెచ్చుకొంటున్నారు. ఒక్కడే ఇంత ఇల్లు కట్టాడా..?! అని ఆశ్చర్యపోతున్నారు.

What do you think?

రాఖీ పండుగ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి? పండితులు చెబుతున్న ప్రకారం..

పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించనున్న కేంద్రం