in ,

ఆలోచనే ఆయుధంగా ఎదిగిన వ్యక్తి “లతా చౌదరి”

ఆలోచనే ఆయుధంగా ఎదిగిన వ్యక్తి “లతా చౌదరి”

 

“లతా చౌదరి”  తాను అనుకున్న సక్సెస్ సాధించిన ఒక స్త్రీ జీవిత కథ. హైదరాబాద్ వాస్తవ్యులైన లత చౌదరి తల్లిదండ్రులు రాధాకుమారి, భాస్కరరావు . తండ్రికి బిజినెస్ లో లాస్ వచ్చి తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి వెళ్లారు. కుటుంబ పరిస్థితుల ప్రభావం వల్ల స్కూల్లో ఎప్పుడూ డల్ గా వెనుకబడి ఉండేవారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ ఎదిగిన ఆమె ఏదో ఒక విధంగా తన వంతు సహాయం అందించాలని,  ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా ఆరువందలకు పనికి చేరారు. అది సరిపోదని ఈటీవీలో ఆడిషన్స్ అవుతుంటే వెళ్లి మనోరంజని కార్యక్రమానికి యాంకర్ గా సెలక్ట్ అయ్యారు. తర్వాత సీరియల్స్ లో కూడా అవకాశాలు వచ్చాయి. బిజినెస్ కూడా చేయాలని వైజాగ్లో నక్షత్ర సర్వీస్ అపార్ట్మెంట్ ను కూడా ప్రారంభించారు, ఈవెంట్స్ కూడా చేస్తూ ఉండేవారు, నెమ్మదిగా సంపాదన పరంగా స్థిరపడ్డారు.

నాకెందుకులే అని ప్రతి ఒక్కరు అనుకుంటే సమాజాన్ని ఎవరు పట్టించుకుంటారు అన్న ఆలోచన తో  ఒమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రారంభించారు. బాల సదన్ లాంటి కార్యక్రమాలను కూడా చేసేవారు, అనుకోని బిజినెస్ లాస్ వచ్చి సహాయక కార్యక్రమాలు నిలిపివేయాల్సి వచ్చింది.

ఆ కష్టానికి కృంగిపోకుండా ఎంతో ఆలోచించి ‘కళ ప్రియ ‘ అనే బోటిక్  ను మొదలు పెట్టారు. స్నేహితుల ద్వారా యూఎస్ లో  తానా(TANA) ఈవెంట్లు జరుగుతున్నాయని తెలుసుకుని వారికి ఫోన్ చేసి స్టాల్ బుక్ చేసుకున్నారు.  ఆ ఆఫర్ లెటర్ తో వీసా సంపాదించుకుని యూఎస్ వెళ్లి,  వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తన   వ్యాపారాన్ని అభివృద్ధి  పరుచుకున్నారు,  తిరిగి ఎన్జీవో స్టార్ట్ చేసి 500 పైన మహిళలకు ఉపాధి కల్పించారు. నారీ సేన అనే మరో సంస్థ ను కూడా మొదలు పెట్టారు.

వచ్చిన జీతాన్ని ఆమె సరి పెట్టుకుందామని అనుకొని ఉంటే,  ఆమె అనుకున్నది ఎప్పటికీ సాధించేవారు కాదు. అవకాశాలు నీ వద్దకు రావు,  నీవే బాట వేసుకుని వాటిని చేరుకోవాలి అనడానికి లతా చౌదరి కథే ఒక ఉదాహరణ

What do you think?

అర్ధం లేని రష్యా – ఉక్రెయిన్ వార్… అంతమెప్పుడో!

అందం కన్నా.. ఆత్మ విశ్వాసం ముఖ్యం అంటున్న ససుఫాన్‌