అందం అమ్మాయిల జన్మహక్కు…ఇదే ప్రతి అమ్మాయి భావిస్తుంది. తను అందంగా కనపడాలని ఎన్నో మెరుగులు దిద్దుకుంటుంది . అలాంటి అందానికి ఏదైనా చిన్న లోపం కలిగితే ఎంతో మనస్తాపం చెంది కుంగిపోతుంది. ముఖంపై అవాంఛిత రోమాలు వస్తే నలుగురిలోకి వెళ్లడానికి ఎంతో అవమానం గా భావిస్తారు . అలాంటిది ఒళ్ళంతా జుట్టుతో నిండి పోతే ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది కదా…
కానీ బ్యాంకాక్ కి చెందిన సుపాత్రా ససుఫాన్..చాలా రేర్ జనిటిక్ ప్రాబ్లం అయిన వేర్వూల్ఫ్ సిన్డ్రోమ్ వల్ల ఒళ్ళంతాజుట్టు వచ్చేసింది. తన అంద వికార రూపాన్ని కూడా తన బలంగా మార్చుకుని గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది.
ఆమెను వూల్ఫ్ గర్ల్ అని పిలిచేవారు, ఏది ఆమె మనసును చేరనివ్వలేదు. వరల్డ్స్ హెయిరియస్ట్ గర్ల్ గా 2010 లో వరల్డ్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
విలేఖరులు .. ఇలా ఉన్నందుకు మీరు ఎలా అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు, ధీటుగా తన రూపం తనకి శాపం కాదు బలమని సమాధానమిచ్చింది., తనకి స్నేహితులు ఉన్నారని కొద్దిమంది చేసే విమర్శలను పట్టించుకోనని…తన రూపం వల్లే, తను వరల్డ్ రికార్డు సాధించగలిగా అని చెప్పింది.