in

భారతీయ నౌకాదళ బాహుబలి- ఐ ఎన్ ఎస్ విక్రాంత్

ఐ ఎన్ ఎస్ విక్రాంత్

భారతీయ నౌకాదళ బాహుబలి- సంద్రం పై నడయాడే మోడరన్ ఆర్మీ శత్రువు ఎవరైనా సరే వార్ వన్ సైడే –

INS విక్రాంత్

ఎత్తు: 59 మీ
వెడల్పు: 62 మీ
పొడవు: 262 మీ
బరువు: 40 వేల టన్నులు
ఉత్పత్తి వ్యయం: 20 వేల కోట్లు
డిజైనర్: వార్‌షిప్ డిజైనర్ బ్యూరో

 

ఇది నిజం గ బాహుబలేనా, శత్రు దుర్బేధ్యమేనా, వరల్డ్ లో మనమెక్కడ. రీడ్ నౌ …
మన ఇండియా కొత్త స్లోగన్

“షేపింగ్ ఏ డ్రీం – బిల్డింగ్ ఏ నేషన్ “తొలి అడుగే ఈ IN S VIKRANT.
ఐ ఎన్ ఎస్ విక్రాంత్ డిఫన్స్ సెక్టార్ లో మనం సాధించిన హై ఎండ్ అడ్వాన్సడ్ టెక్నాలజీ తో కూడిన ప్రగతి కి ది బెస్ట్ శాంపిల్ ఇది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ తో తయారుచేసిన మొట్ట మొదటి ఎయిర్ క్రాఫ్ట్ కారియర్. నిజం గ ఇదే మన దేశం గర్వించదగ్గ విషయం. మన సత్తాకు నిలువెత్తు రూపం.

విదేశీ కుట్రలనుండి మనల్ని మనం రక్షించు కోటానికి ఇదొక బ్రహ్మాస్త్రమే.
సముద్ర జలాల పై డ్రాగన్ అధిపత్యానికి కౌంటర్ ఈ బాహుబలి. ఈ నౌక కొచ్చిన్ తీరం లో జల ప్రవేశం చేసింది. ఇప్పటివరకు ఈ సామర్థ్యం అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా లకు మాత్రమే ఉండేది. నలభై వేల టన్నులకు పైగా బరువుండే ఈ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ షిప్ లాంటివి సొంతం గతయారు చేసే దేశాల్లో మనం కూడా చేరిపోయాం.

ఇంతకు ముందు ( 1961-1980) విదేశీ యుద్ధ నౌకలను కొనుగోలు చేసి దానికి విరాట్ అండ్ విక్రాంత్ అనే పేర్లు పెట్టుకున్నాం. సర్వీస్ ముగియడం తో ఈ రెంటిని తొలగించారు. 2013 లో రష్యా నుండి కొన్న ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్య ఒక్కటే మన అమ్ములపొదిలో ఉండేది. ఇప్పుడు దీనికి ఐ ఎన్ ఎస్ విక్రాంత్ తోడయ్యింది. ఇవి రెండువందల మైళ్లకు పైగా ప్రయాణించగలవ్.

దీన్నే కారియర్ టీం అనికూడా అంటారు. సముద్రజలాల పై పట్టు సాధించడం లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లే హీరో లు,మాములు యుద్ధ నౌకలకు ఈ విమాన వాహక యుద్ధ నౌకకు తేడా ఏంటంటే, యుద్ధం అవసరాన్ని బట్టి మొత్తం ఎయిర్ బేస్ ను దీనిమీదే మోహరించవచ్చు. ఈ ఎయిర్ బేస్ లో ఫైటర్ విమానాలుంటాయి, ఇవి నేల మీద, నీటిమీద ఉండే ఓడల మీద, అలాగే జలాంతర్గాములు ను వేటాడే హెలికాఫ్టర్ ల పైన దాడి చేయగల్గుతాయి. రన్ వే రెండు హాకీ మైదానాలకు సమానమైన స్పేస్ కల్గి ఉంటుంది. దీనిపైన 12 హెలికాఫ్టర్లు ను, 6 ఫైటర్ జెట్ లను ఒకేసారి పార్క్ చేయగలం. ఇప్పటివరకు మనకున్న యుద్ధ నౌకల లో ఉన్న ఫీల్డ్ డెస్క్ కన్నా ఇది పెద్దది. ఇతర నౌకలతో కలిసి ఒక సంక్లిష్టమైన ఫార్మాట్ లో ప్రయాణిస్తుంది. ఇవన్నీ కలిసి యుద్ధ సామర్ధ్యాన్ని మరింత పెంచుతాయి. ఇది యుద్ధ నౌకలు విమాన వాహక యుద్ధ నౌకలకు మధ్య ఉన్న సంబంధం.

భారత్ కు దీన్ని తయారు చేయటానికి పదమూడేళ్లు పట్టింది. మొదటి దశ 2007 మే లో, పూర్తయింది. రెండవ దశ డిసెంబర్ 2014, మూడవ దశ 2019 అక్టోబర్ లో కంప్లీట్ అయ్యింది. విక్రాంత్ డిజైన్ ను ” వార్ షిప్ డిజైనర్ బ్యూరో “రూపొందించింది. నిర్మాణాన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ పూర్తి చేసింది. ఇక స్టీల్ ను ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్, డి ఆర్ డి ఓ అందించాయి.
ఐ ఎన్ ఎస్ విక్రాంత్ తయారీ కి వాడిన పరికరాల్లో అత్యధిక భారత్ లోనే తయారయ్యాయి. ఆరు కి పైగా పెద్ద పరిశ్రమలు, వందకి పైగా చిన్న పరిశ్రమలు తయారీ పరికరాలు, యంత్రాలు అందించాయి.

దీనికి నాలుగు గ్యాస్ టర్బయిన్స్, మొత్తం 88 మెగా వాట్ల పవర్ ఉంటుంది. 28 నాట్స్ వేగం తో నడుస్తుంది.

INS Vikrant Design Description
•తొలి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్
•2,200 కంపార్ట్మెంట్ లు
•1600 వందల మంది సిబ్బంది.
• 30 యుద్ధ విమానాలు మిగ్ 29 కే ఫైటర్ జెట్ లు
•కమావ్-31, హెచ్ ఆర్ సి హెలీకాఫ్టర్స్
•ఒకే సారి వేయి బుల్లెట్స్ ను రిలీజ్ చేయ గల ఏ కె 630 గన్ కల్గి ఉండటం దీని మరొక ప్రత్యేకత
• E W Sakthi అనే రాడార్ సిస్టం (ఎదురు వచ్చే యుద్ధ నౌకను గమనించడం, మరియు మన నౌక కనపడకుండా ఉండే సిస్టం దీని ప్రత్యేకత )
•ఐసియూ, మెడికల్ కాంప్లెక్స్

మన తీరం నుండి సుదూర సముద్ర జలాల్లో కూడా పోరాడే సత్తా దీనికుంది. కేవలం రక్షణ కోసమే కాదు, ఎదురు దాడికి కూడా తిరుగులేని అస్త్రం, చైనా హిందూ మహాసముద్రం, అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతం ల లో కన్ను వేసిన నేపథ్యం లో ఈ ఐ ఎన్ ఎస్ విక్రాంత్ జల ప్రవేశం మనకు ఒక ఊరట అని అనుకోవచ్చు.బ్రహ్మాండమయిన ఆయుధం. బ్లూ వాటర్ నేవీ లో మన దేశ సత్తా మరింత పెరుగుతుంది.

ఒక ఐ ఎన్ ఎస్ విక్రాంత్ లాంటి యుద్ధ నౌక ఉందంటే అది శత్రు దేశాల్లో సైనిక స్థావరం ఏర్పరచు కోటం తో సమానం. సింపుల్ గ చెప్పాలంటే సంద్రం పై నడయాడే మోడరన్ ఆర్మీ ఇది.
————————————– శత్రువు
ఎవరైనా సరే – వార్ వన్ సైడే.
ఐ.ఎన్.ఎస్.   విక్రాంత్.

What do you think?

బడా చోర్ ల బిగ్గెస్ట్ అడ్డా … లండన్

సినీ రంగ ప్రముఖుల పై బి జె పి గురి- మాస్టర్ ప్లాన్