in

దేశం పేరును భారత్ గా మార్చనున్న కేంద్రం

దేశం పేరును భారత్ గా మార్చనున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. దేశం పేరును మార్చడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మన దేశం పేరును ఇండియాకు బదులుగా భారత్ అని మార్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని సమాచారం. జీ 20 డిన్నర్ ఇన్విటేషన్ పత్రికలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించింది. దీంతో కేంద్రం దేశం పేరు మార్చడానికి కసరత్తు చేస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

కాగా మరో వైపు ఇండియా కూటమి దీనిపై మండి పడుతోంది. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడం వల్ల బీజేపీ ఓట్లు తగ్గుతాయని భయపడుతోందని, అందువల్లే ఇలాంటి వ్యూహాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ రేపు ఇండియా కూటమి భారత్‌ గా పేరు మార్చుకుంటే, భారత్ పేరును మార్చి బీజేపీ అని పెడతారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

What do you think?

తెలంగాణా గవర్నర్ గా సూపర్‌స్టార్ రజినీకాంత్‌?

ఉదయనిధి స్టాలిన్ కు అదనపు పోలీస్ భద్రత