in

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ దూకుడు.. బ్రిటన్ను దాటేసి..

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ దూకుడు..

బ్రిటన్ ను దాటేసిన భారత్, 2029 నాటికి 3వ అతి పెద్ద శక్తిగా భారత్, సరిగ్గా దశాబ్దం కిందటి గణంకాలను పరిశీలిస్తే.. భారతదేశం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 11వ స్థానంలో ఉండగా.. బ్రిటన్ 5వ స్థానంలో ఉంది. ఇక, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

కాలం ఎల్లప్పుడూ ఒక్కరి పక్షానే ఉండదని మరోసారి రుజువైంది. తన సామ్రాజ్యవాదంలో భారత వనరులను ఏకంగా 200 సంవత్సరాల పాటు కొల్లగొట్టిన బ్రిటన్ ఆర్థికంగా నేడు వెనకబడింది. ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ యూకేను వెనక్కు నెట్టింది. దీనిపై యావత్ భారత్ తో పాటు వ్యాపారవేత్తలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బ్రిటీష్ రాచరిక పాలనలో మనం 200 ఏళ్లకు పైగా మగ్గాం. బ్రిటీషర్లు మన కోహినూర్ వజ్రం నుంచి మొదలుపెడితే మన సంపదనంతా దోచుకుపోయారు. దేశానికి స్వాతంత్రం  వచ్చే వరకు పీల్చి పిప్పి చేశారు. చివరకు స్వాతంత్రం  ఇచ్చి గుల్ల చేసి వెళ్లిపోయారు. అలాంటి ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న భారత దేశం ఇప్పుడు ఈ 75 ఏళ్ల తర్వాత మనల్ని పాలించిన బ్రిటీషర్లను అధిగమించింది. ఇదొక అద్భుతమైన ఘనత అనే చెప్పొచ్చు.

బ్రిటన్ ను అధిగమించి ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం పై దేశం లోని పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు హర్షం వ్యక్తం చేసారు. కర్మ సిద్ధాంతం అంటే ఇదేనని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేసారు. భారత్ గందరగోళం లో పడిపోతుందని భావించిన వారందరికీ ఇదొక గట్టి సమాధానం అని ఆనంద్ మహేంద్ర పేర్కొన్నారు.

ప్రపంచం లోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి భారత్ ఎగబాకింది. ఈ క్రమంలో బ్రిటన్ ను ఆరో స్థానానికి నెట్టేసింది. కరోనా లాంటి పాండెమిక్ సిట్యువేషన్స్ తర్వాత, ఉద్దీపన చర్యలపై అధికం గ ఖర్చు పెట్టడమే ఆర్థికంగా పుంజుకోవటానికి ప్రధాన కారణమని ఒక అంతర్జాతీయ సంస్థ నివేదిక చెప్తుంది.

భారతదేశం ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది “2014 నుండి భారత్ అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణల మార్గం ద్వారా 2029 నాటికి దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలిచే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు 6.7 – 7.7 శాతం మధ్య ఉంటుందని SBI ఆర్థిక పరిశోధన విభాగం పరిశోధన నివేదిక అంచనా వేసింది. అయితే, ప్రపంచ అనిశ్చితి కారణంగా 6 – 6.5 శాతం వృద్ధి సాధారణమేనని కూడా చెబుతున్నారు.

2040 నాటికీ భారత ఆర్థిక వ్యవస్థ 20 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కేంద్ర ఆర్ధిక మండలి చైర్మన్ వివేక్ దెబ్రాయ్ తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో వార్షిక వృద్ధి రేట్ ఏడు నుండి ఏడు పాయింట్ అయిదు శాతం గ ఉంటె ఇది సాధ్యమవుతుంది.

ఇక, 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారతదేశం బ్రిటన్ ను అధిగమించిందని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని బ్లూమ్ బర్గ్ కథనం పేర్కొంది. ఈ గణన యూఎస్ డాలర్లపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి జీడీపీ గణాంకాల ప్రకారం భారతదేశం మొదటి త్రైమాసికంలో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఎదిగి 854.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆర్థిక కష్టాలతో బ్రిటన్ మరింత చితికిపోతుందని భావిస్తున్నారు.

మొదటి త్రైమాసికంలో భారతదేశం ఆధిక్యాన్ని పెంచుకున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి వచ్చిన GDP డేటా చూపించింది. “2014లో 2.6 శాతంగా ఉన్న GDPలో భారతదేశం వాటా ఇప్పుడు 3.5 శాతంగా ఉంది, 2027లో 4 శాతం దాటే అవకాశం ఉంది. ఇది ప్రపంచ GDPలో జర్మనీ, ప్రస్తుత వాటా” అని నివేదిక పేర్కొంది.

భారత్ కొత్త పెట్టుబడుల విషయంలో చైనా మందగమనం నుండి భారత ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో నివేదిక పేర్కొంది. “గ్లోబల్ టెక్ మేజర్ ఆపిల్ తన ఫ్లాగ్లిప్ ఐఫోన్ 14 ఉత్పత్తిలో కొంత భాగాన్ని భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్కు మార్చాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్ 7 న విడుదలైన తర్వాత కొన్ని వారాల సమయం తక్కువగా ఉండటం అటువంటి ఆశావాదానికి నిదర్శనం” అని నివేదిక పేర్కొంది.

ఆగస్టు 31న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి విడుదల చేసిన GDP నెంబర్లు, భారత ఆర్థిక వ్యవస్థ 13.5 శాతం వృద్ధిని చూపుతున్నాయి. జిడిపి వృద్ధి రేటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ అంచనా 16.2 శాతం కంటే తక్కువగా ఉంది. ఇంకా, భారత ఆర్థిక వ్యవస్థ 202 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1) తక్కువ బేస్ కారణంగా 20.1 శాతం GDP వృద్ధిని నమోదు చేసింది.

2008 ఆర్థిక మాంద్యం.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం అనేక దేశాలను అతలాకుతలం చేసింది. దాని తరువాత మళ్లీ కరోనా కారణంగా ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మళ్లీ మందగించాయి. వీటికి తోడు కోలుకుంటున్న సమయంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం ఊపందుకుంది. సరఫరా వ్యవస్థలు స్తంభించటం,ఇబ్బందులకు గురికావటం వల్ల ఉత్పాదకత మళ్లీ దెబ్బతింది.

భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి అన్ని దేశాలపై దోచుకొని బలపడిన బ్రిటన్ ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైంది. అక్కడ ఉద్యోగ, ఉపాధి కరువైంది. అందుకే దాని జీడీపీ పడిపోయింది. కానీ మన భారతావని మాత్రం కరోనాను తట్టుకొని నిలబడింది. మోడీ సర్కార్ చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా ముందుకు సాగుతోంది.

ఈ క్రమంలోనే ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. టాప్ 5లో ఉన్న బ్రిటన్ దేశాన్ని అధిగమించింది. మనల్ని పాలించిన బ్రిటన్ ను అధిగమించి బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగిన భారత్ తీరును ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కొనియాడారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశాడు.

బ్రిటీష్ వారు 200 ఏళ్లు మనపై పడి దోచుకున్నా.. కేవలం 75 ఏళ్లలో మనం వారిని అధిగమించామంటే ఇది ఖచ్చితంగా గొప్పతనమే. భారతీయుల కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం అని చెప్పొచ్చు.

ఇలా బ్రిటన్ ను వెనక్కి నెట్టిన భారత్.. ప్రపంచంలో సరికొత్త రికార్డ్ .. దూకుడుగా 5వ స్థానానికి …

What do you think?

జైల్ సుఖపురుషుడీ… ‘ కాన్ మాన్’ చంద్రశేఖర్

సూపర్ కాప్-తొమ్మిదేళ్ల నిరీక్షణ..”గర్ల్ నెంబర్166″