in

జైల్ సుఖపురుషుడీ… ‘ కాన్ మాన్’ చంద్రశేఖర్

జైల్ సుఖపురుషుడీ… ‘ కాన్ మాన్’ చంద్రశేఖర్

ఒకరి నమ్మకాన్ని పొందడం ద్వారా, నిజం కానిదాన్ని నమ్మమని వారిని ఒప్పించడం ద్వారా మోసగించే వ్యక్తే ‘ కాన్ మాన్’- సుఖేష్ చంద్రశేఖర్.

సుఖేష్ చంద్ర శేఖర్ ఇపుడీపేరు సినీరంగం లో ప్రముకులనే కాదు, రాజకీయ రంగాన్ని సైతం ఒక కుదుపు కుదిపేసింది. కో అంటే కోటి విలాసాలు. తలచుకుంటే టాప్ మోడల్స్ దిగి రావాల్సిందే. ప్లేస్ ఏదైనా బాలీవుడ్ హీరోయిన్స్ తో మీటింగ్స్, చాటింగ్స్. కటకటాల్లోనూ తగ్గేదే లే’ జైల్లో సెపరేట్ రూమ్, ఫ్రిడ్జ్. అంతేనా జైలు నుండే బేరాలు. కోట్ల రూపాయల దందాలు. ఫోన్ లోనే రీచ్ అయ్యే బిగ్ టార్గెట్ లు. పార్టీస్ తో జైలు గోడలు సైతం సలాం కొట్టాల్సిందే.

2021 డిసెంబర్ 5 ముంబై ఎయిర్పోర్ట్ లో నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ ను ఈ డి అడ్డుకోవటం తో అతని మోసాలు, జైలు లో రాచ భోగాలు, సుఖేష్ చంద్రశేఖర్ రాసలీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. హై ఫై కేటుగాడు సుఖేష్ పై ఈ డి దర్యాప్తు లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఇంతకీ ఎవరీ ‘ కాన్ మాన్’ సుఖేష్ చంద్ర శేఖర్.

కర్ణాటక లోని బెంగళూరు కు చెందిన సుఖేష్ చంద్ర శేఖర్ 17 ఏళ్ళ నుండే మోసాలకు అలవాటు పడ్డాడు. మొదట బెంగళూరు, చెన్నై కేంద్రాలు గ సినీ రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. తర్వాత బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్న ఘరానా మోసగాడు. హెూమ్ మంత్రి మొదలుకొని బడా బడా రాజకీయ నేతలకు తానెంత చెపితే అంతే నని బిల్డ్ అప్ లిచ్చి బుట్టలో వేసుకుంటాడు ఈ ఘరానా మోసగాడు.

ఇలానే 2007 లో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ లో ఉద్యోగాలిప్పిస్తానని వంద మందికి పైగా మోసం చేసాడు. ఈ కేస్ లో అరెస్ట్ అయి జైల్లో ఊచలు లెక్క పెట్టాడు అయినా ఇతని తీరులో కొంచెం కూడా మార్పు లేదు. సుఖేష్ పై 30 కె పైగా కేస్ లు నమోదయ్యాయి. తమిళనాడు లో కరుణానిధి కొడుకు గ, ఏ పి లో జగన్ మేనల్లుడి గ ఎక్కడి పడితే అక్కడ ఎవరి పేరునైనా వాడేసుకుంటాడు.
2010 లో సుఖేష్ కి మోడల్, నటి లీనాపాల్ తో పరిచయం అయింది. ఇతను ప్రజల్ని మోసం చేయటం లో లీనా మద్దతునిచ్చింది. 2015 లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని ముంబైకి మకాం మార్చారు . ముంబై లో నకిలీ పథకాల పేరు చెప్పి 450 మందిని మోసం చేసి 19.5 కోట్ల రూపాయలను కాజేశారు ఈ జంట కిలాడీలు. ఈ కేస్ లో ఇద్దరి పైన సి బి ఐ కేస్ నమోదు చేసింది.

2020 లో సుఖేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అయి తీహార్ జైలు కెళ్ళాడు. అయితే తీహార్ జైలు ను కూడా తన మోసాలకు వేదిక గ మలచుకున్నాడు ఈ జగత్ కిలాడీ. జైలు అధికారులకు కోట్ల రూపాయలను ముట్ట చెప్పిన సుఖేష్ జైల్లోనూ సెపరేట్ రూమ్, ఫ్రిడ్జ్…ఇలా భోగవిలాసాలు అనుభవించాడు.
2017 నుండి ఇప్పటివరకు సుఖేష్ కు ములాఖత్ పెట్టిన వారిలో ఏ ఐ పి లున్నారు. అంతే కాదు సుఖేష్ ను కలిసేందుకు జైలు వద్దకు 12 మంది మోడళ్ళు, హీరోయిన్స్ క్యూ కట్టారంటే మనోడి లేవేలేంటో అర్ధం చేసుకోవచ్చు.

2020 జూన్ లో సుఖేష్ టెక్నాలజి సాయం తో రాన్ బాక్సీ సంస్థ మాజీ యజమాని భార్య అదితి సింగ్ ని ట్రాప్ చేసినట్టు ఈ డి బయట పెట్టింది. ఈ సుఖపురుషుడి పై మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతను, ఇతని భార్య లీనా కూడా హవాలా ద్వారా మోసాలకు పాల్పడినట్లు తేలింది.

కాస్టలీ బహుమతులతో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ను ముగ్గులోకి దింపాడు సుఖేష్ ఈ బ్యూటీ క్వీన్ కోసం కొట్టుకొచ్చిన కోట్ల రూపాయలను వెచ్చించి ఖరీదయిన బహుమతులు గుమ్మరించాడు. ఇదే విషయాన్ని జాక్వలిన్ వప్పుకున్నట్లు ఈ.డి తేల్చి చెప్పింది. జాక్వలిన్ కు సుఖేష్ బహుమతుల జాబితా లో 52 లక్షల విలువైన అరేబియా గుర్రం, తొమ్మిది లక్షల విలువైన 3 పర్శియన్ పిల్లులు, డిమాండ్ సెట్లు వంటి ఖరీదయిన బహుమతులు, జాక్వలిన్ ప్రయాణం కోసం బుక్ చేసిన ఛార్టర్డ్ ఫ్లైట్ లు ఉన్నాయ్.

సుఖేష్ నుండి 16 లగ్జరీ, స్పోర్ట్స్ కార్ లను స్వాధీనం చేసుకున్న ఈ డి. ఈ ఘరానా మోసగాడు క్రిప్టో కుర్రేన్సీ లో కూడా కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు తేలింది. తవ్వేకొద్దీ బయటపడుతున్న శుకపురుషుడి సుఖేష్ మాయ లోకం లో అంతులేని రహస్యాలెన్నో. జాక్వలిన్ తో పాటు నటి నోరా ఫతేహి కు కూడా సుఖేష్ చాల ఖరీదయిన బహుమతులు పంపాడు. నోరా కు కోటి రూపాయలు విలువైన బి ఎం w, ఐఫోన్ ను సుఖేష్ బహుమతి గ ఇచ్చినట్లు ఈ .డి. తేల్చింది. వీరితో పాటు పింకీ ఇరానీ అనే మరో మహిళను అనుమానితురాలుగా చేర్చి తాజాగా దర్యాప్తు ముమ్మరం చేసింది.

What do you think?

ట్రంప్ కు బిగ్ షాక్..మరో సారి మరో కేసులో నిందితుడు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ దూకుడు.. బ్రిటన్ను దాటేసి..