in

ట్రంప్ కు బిగ్ షాక్..మరో సారి మరో కేసులో నిందితుడు

ట్రంప్ కు బిగ్ షాక్.. మరో సారి మరో కేసులో నిందితుడు

 

యూఎస్: గత నెల పోర్న్ స్టార్‌కు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చిన కేసు (Hush Money)లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన ట్రంప్ కు ఇప్పుడు మరో షాక్ తగిలింది.

 

అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమవుతోన్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ కు బిగ్ షాక్ తగిలింది. రచయిత్రి ఇ.జీన్ కారెల్ ను ట్రంప్ వేదించిన మాట నిజమేనని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది. ఆమెకు పరిహారంగా 5 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆదేశించింది.

అసలు విషయం ఏంటంటే ప్రముఖ రచయిత్రి ఇ.జీన్ కారెల్, ఆమెపై ట్రంప్ 1996లో మాన్ హటన్ అవెన్యూ లో అత్యాచారానికి పాల్పడ్డారని, తనను పలుమార్లు లైంగికంగా వేధించారని ఆయనపై పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇటీవల ఈ విషయం నిజమేనని, ట్రంప్ కారెల్ ను లైగికంగా వేదించారని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది. ఆమెకు పరిహారంగా 5 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆదేశించింది.

దీంతో ట్రంప్  మరో బిగ్ షాక్  తగిలినటైంది.

What do you think?

ట్విట్టర్ లో కొత్త ఫీచర్లపై ఎలోన్ మస్క్ ట్వీట్..

జైల్ సుఖపురుషుడీ… ‘ కాన్ మాన్’ చంద్రశేఖర్