in

రూ.2వేలకు తగ్గని విద్యుత్ ఛార్జీలు. భారమైన నేతన్న జీవితం

రూ.2వేలకు తగ్గని విద్యుత్ ఛార్జీలు. భారమైన నేతన్న జీవితం

ఏపీలో విద్యుత్ ఛార్జీలు సామాన్యుడికి భారంగా మారాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో రూ. వెయ్యి లోపు కరెంట్ బిల్ రావట్లేదు. మరో వైపు ఈ విద్యుత్ ఛార్జీల మూలంగా చేనేత కార్మికులు బతకడమే కష్టం అయిపోయింది.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇంట్లో నాలుగు మగ్గాలు ఉంటే వాటికి రూ. వెయ్యి కరెంట్ బిల్లు వచ్చేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్తు చార్జీలు రూ. 2500 కి చేరిపోయాయి. ఇలా కరెంటు బిల్లు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు రావడంతో చేనేత కార్మికులు మగ్గాలను తూకానికి అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది.

దీంతో పెరిగిన విద్యుత్ చార్జీలు తమకు గిట్టుబాటు కావడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

What do you think?

అరుదైన రికార్డు సృష్టించిన శుభ్‌మన్ గిల్!

ఉల్లి ఘాటుకి రిటర్న్ అయిన ఫ్లైట్..