in

పుట్టిన రోజు జరుపుకుని గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు!

పుట్టిన రోజు జరుపుకుని గిన్నిస్ రికార్డు నెలకొల్పారు!

పాకిస్తాన్ లోని ఓ కుటుంబం వరల్డ్ రికార్డు సృష్టించింది. కానీ దాన్ని వాళ్లు కష్టమైన పని చేసో, వింతలు, అద్బుతాలు చేయడం ద్వారానో పొందలేదు. కేవలం ఇంట్లో పుట్టిన రోజు జరుపుకొని నెలకొల్పారు.

గిన్నిస్ రికార్డ్: పాకిస్తాన్ లోని లర్కానా నగరానికి చెందిన అమీర్ అలీ, ఖుదేజా భార్యభర్తలకు 1992, ఆగస్టు 1న మొదటి పాప పుట్టింది. తర్వాత ఆమెకు వరుసగా ఆరుగురు జన్మించారు. విచిత్రం ఏమిటంటే వారికి పుట్టిన పిల్లలందరూ ఒకే తేదీన జన్మించారు. అమీర్ అలీ, ఖుదేజాల పుట్టిన రోజు, పెళ్లి రోజు కూడా ఒకే తేదీన కావడం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. దీంతో ప్రతి ఏడాది వారి పుట్టిన రోజును పెద్ద పండుగల జరుపుకుంటూ వచ్ఛారు. అలా పుట్టిన రోజు మూలంగా ఇప్పుడు గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సృష్టించారు.

అయితే గతంలో అమెరికాకు చెందిన కమిన్స్ కుటుంబం ఫిబ్రవరి 20న ఐదుగురు పిల్లలతో ఈ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోగా.. ఇప్పుడు పాకిస్తాన్ కు చెందిన అమీర్ అలీ కుటుంబం ఆ రికార్డును బ్రేక్ చేసి, ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఒకే తేదీన పుట్టిన రోజు జరుపుకుంటున్న కుటుంబంగా గిన్నిస్ రికార్డును సృష్టించారు.

What do you think?

గ్రామస్తుల పేరు మీద రూ.20కోట్ల రుణాలు తీసుకున్నాడు

ఏఐ ఉపయోగిస్తూ 90 శాతం ఉద్యోగులను తొలగించిన కంపెనీ