in

ఏఐ ఉపయోగిస్తూ 90 శాతం ఉద్యోగులను తొలగించిన కంపెనీ

ఏఐ ఉపయోగిస్తూ 90 శాతం ఉద్యోగులను తొలగించిన కంపెనీ

అందరూ ఊహించినట్టే జరుగుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగులకు ముప్పుగా మారింది. ఈ ఏఐ మూలంగా కొన్ని కంపెనీలు చాలా వరకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీ ఈ పనే చేసింది. ఏకంగా కంపెనీలోని 90 శాతం ఉద్యోగులను తొలగించింది.

వివరాల్లోకి వెళ్తే ‘దుకాణ్’ అనే ఓ ఈ కామర్స్ స్టార్టప్ కంపెనీ భారీగా ఉద్యోగులను తొలగించింది. కస్టమర్ సర్వీస్ విభాగంలో ఏకంగా 90 శాతం ఉద్యోగులను తీసేసింది. దీనిపై స్పందించిన సీఈవో సుమిత్ షా ఈ నిర్ణయంతో కస్టమర్ సపోర్ట్‌లో 85 శాతం ఖర్చులు తగ్గాయని తెలిపారు. దీంతో పాటు సర్వీసులో వేగం పెరిగిందని అన్నారు. ఇంతకు ముందు సమస్యను పరిష్కరించడానికి 2 గంటలు పట్టేదని.. కానీ ఇప్పుడు 3 నిమిషాల్లోనే పూర్తవుతుందని చెబుతూ తను తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

What do you think?

పుట్టిన రోజు జరుపుకుని గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు!

పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స