in ,

పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స

పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వాలంటీర్ల పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లు కొన్ని చోట్ల నిరసన వ్యక్తం చేస్తుంటే.. మరో వైపు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన పై మండి పడుతున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ ప్రభుత్వ వాలంటీర్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అన్న బొత్స, అసలు వలంటీర్ అంటే ఎవరో, వారి విధి విధానాలు ఏంటో పవన్ తెలుసా..? అంటూ పవన్ ను నిలదీశారు. కేవలం వలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికీ మంచి పేరు వస్తోందన్న దుర్బుద్ధితో, ప్రభుత్వం పై బురధ చల్లాలన్న ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారని బొత్స మండిపడ్డారు.

అయితే వాలంటీర్లపై తను చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఇటీవల వివరణ ఇస్తూ తను అలా మాట్లాడటంలో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. తను చేసిన ఆ వ్యాఖ్యల వెనుక ఎంతో బాధ ఉందని.. జాతీయ గ్రామీణ ఉపాధికి వచ్చేంత డబ్బు కూడా ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తికి రావట్లేదని పేర్కొన్నారు. 5 వేల రూపాయలతో కష్టం మీద జీవితం గడుపుతున్న వారి కడుపు కొట్టాలని తను ఎప్పుడూ అనుకోనని అన్న పవన్ డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి నెలకి కేవలం 5 వేలు వచ్చే వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగ శాతం ఏ స్థాయిలో ఉందో ఊహించండి అంటూ వ్యాఖ్యానించారు.

What do you think?

ఏఐ ఉపయోగిస్తూ 90 శాతం ఉద్యోగులను తొలగించిన కంపెనీ

భారత్ లో తయారీ సంస్థను ప్రారంభించనున్న టెస్లా!