in

గ్రామస్తుల పేరు మీద రూ.20కోట్ల రుణాలు తీసుకున్నాడు

గ్రామస్తుల పేరు మీద రూ.20 కోట్ల రుణాలు తీసుకున్నాడు

చాటపర్రులో ఓ వ్యక్తి గ్రామస్తుల పేరు మీద బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నాడు. బకాయిలు తీర్చాలని గ్రామస్తులకు నోటీసులు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా చాటపర్రులో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గ్రామస్తుల పేరు మీద వారి ఆస్తి పత్రాలు కెనరా బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 కోట్ల రుణాలు తీసుకున్నాడు. ఈ పనిలో అతనికి అధికారులు కూడా సహఖరించారు.

అయితే కొన్ని నెలలకి బ్యాంక్ నుండి బకాయిలు తీర్చాలని గ్రామస్తులకు నోటీసులు రావడంతో ఈ విషయం బయటపడింది. బ్యాంకు నోటీసులు చూసిన గ్రామస్తులు విషయం ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా దీనికి సంభందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

What do you think?

కొత్త మలుపు తిరిగిన మధ్యప్రదేశ్ ఆదివాసీ ఘటన

పుట్టిన రోజు జరుపుకుని గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు!