in ,

పొడవైన జుట్టుతో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు

పొడవైన జుట్టుతో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు

15 ఏళ్ల కుర్రాడు తన పొడవైన జుట్టుతో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.

వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ కు చెందిన సిదద్దీ ప్ సింగ్ చాహల్ అనే 15 ఏళ్ల కుర్రాడు తన జీవితంలో ఇప్పటివరకు జుట్టును కత్తిరించుకోలేదు. మత సంప్రదాయాలను పాటించే సిదక్ దీప్ కుటుంబం చిన్నప్పటి నుంచి అతడి జుట్టును కత్తిరించలేదు. దీంతో అతడి జుట్టు ఏకంగా 146 సెంటీమీటర్లు పెరిగడంతో ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు (Longest Hair) ఉన్న కుర్రాడిగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఆ విధంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2024 బుక్ లో సిదక్ దీప్ చోటు సంపాదించుకున్నాడు.

కాగా ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (guinness book of world records) అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.

ఇక ఈ రికార్డు దక్కడం పై సిదక్ దీప్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే చిన్నతనంలో ఈ జుట్టు అంటే తనకు అస్సలు ఇష్టం ఉండేది కాదని.. కానీ, తనకు అదే ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పుకొచ్చాడు.

What do you think?

వేలంలో రూ.9.14 కోట్లు పలికిన బ్రిటిష్‌ యువరాణి స్వెటర్‌!

టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ అరుదైన రికార్డ్