in

రూ.8.5 కోట్లు విలువ చేసే బంగారు బిస్కెట్లు స్వాధీనం

రూ.8.5 కోట్లు విలువ చేసే బంగారు బిస్కెట్లు స్వాధీనం

పశ్చిమ బెంగాల్లో అధికారులు 106 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని ధర రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా.

వివరాల్లోకి వెళ్తే భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ గ్రామం సమీపంలో సరిహద్దు భద్రతా దళం, డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఓ ఆపరేషన్ చేపట్టారు.

ఈ ఆపరేషన్లో 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 2న సోదాలు చేయగా.. ఓ గుంత తవ్వి మట్టికింద అక్రమంగా దాచి ఉంచిన 106 బంగారం బిస్కెట్లు, ముక్కలను కనుగొని సీజ్ చేశారు. ఆ బంగారు బిస్కెట్ల బరువు దాదాపు 14.3 కిలోలు ఉండగా.. వాటి ధర రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బంగారం అక్రమ తరలింపు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో పాటు అతడికి సహాయకుడిగా ఉన్న ఇంకొకరిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

What do you think?

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

11వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ