11వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఆయా మార్గాల్లో పనుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ మేరకు ఆ రైళ్ల రద్దు వివరాలను పేర్కొంది. గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైలును సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు, విశాఖపట్నం-గుంటూరు (17240) రైలును 6 నుంచి 11 వరకు, విశాఖపట్నం-విజయవాడ (22701), విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపింది.