in

గ్రామ సింహానికి భయపడిన అడవి సింహం.వైరల్ విడియో!

అడవికి రాజు సింహం. ఇది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. కానీ సింహం కుక్కకు భయపడి పరుగులు తీయడం చూశారా? సింహం కుక్కకి భయపడడమా? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజమేనండి. అడవి సింహం గ్రామ సింహం అయిన కుక్కకు భయపడి పరుగులు తీసింది.

గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా కూడా మారింది.
ఆ విడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ సమీపంలోని ఓ గ్రామంలోకి రాత్రిపూట ఓ సింహం ప్రవేశించింది. అక్కడ వీధిలో ఆవుల మంద కనిపించడంతో వాటిన టార్గెట్ చేసిన సింహం అటువైపు వెళ్ళింది.

అయితే అదే సమయానికి వీధి కుక్కలు సీన్‌లోకి వచ్చాయి. సింహాం ఆవుల వైపు వెళ్తుండటం గమనించిన ఓ నాలుగైదు కుక్కలు దాని వెంటపడ్డాయి. ఆ కుక్కలను చూసిన సింహం భయపడి తోక ముడుచుకుని వెళ్ళిపోయింది.

గ్రామ సింహాలకు భయపడి అడవి సింహం పారి పోయిందనమాట. దీనికి సంబంధించిన విడియో సురెందర్ మెహ్రా అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేశారు. దీంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది.

What do you think?

క్యాన్సర్ తో చనిపోయిన వ్యక్తి లేచాడు. మాట్లాడాడు.

విజయవాడ లో 12.97కిలోల బంగారం స్వాధీనం!