in

ప్రభాస్ సినిమా కోసం 5 వేల కిలో మీటర్ల ప్రయాణం

ప్రభాస్ సినిమా కోసం 5 వేల కిలో మీటర్ల ప్రయాణం

 

ప్రభాస్ సినిమా చూసేందకు ఓ మహిళా అభిమాని 5 వేల కిలో మీటర్లకు పైగా ప్రయాణించింది. దీంతో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘బాహుబలి’ సినిమాతో హీరో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా నుంచి జపాన్ వరకు ప్రతి దేశంలో ప్రభాస్ కు ఫాన్స్ ఉన్నారు. ఈ మాటను మరో సారి నిరూపిస్తూ ప్రభాస్ సినిమా చూడడానికి ఓ మహిళ 5 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది.
టోక్యోకు చెందిన నొడికో అనే మహిళ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా చూడడానికి టోక్యో నుంచి సింగపూర్‌కు 5.500 కి.మీ. ప్రయాణించింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నా పేరు నొడికో. నేను ప్రభాస్ అభిమానిని. ప్రభాస్ అంటే ఇష్టం, ఆయన కోసమే చాలా దూరం ప్రయాణించి సినిమా చూస్తున్నాను’ అంటూ వీడియో ద్వారా తెలిపింది. దీంతో ఆ వీడియో వైరల్ గా మారి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

What do you think?

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 31 మంది మృతి

వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం