in

స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా 4లక్షలు కొట్టేశారు

స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా రూ.4లక్షలు కొట్టేశారు

ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో పాటు రోజు రోజుకి సైబర్ క్రైం లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఏ క్షణం ఎటు నుంచి జేబుకు చిల్లు పడుతుందో తెలియక ప్రజలు ఆందోళనతో బతుకుతున్నారు. లేట్ అయిన కరెంట్ బిల్ వెంటనే కట్టకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆదర్ కార్డు, పాన్ కార్డులను వెంటనే అప్డేట్ చేయించమని ఇలా రకరకాల మాటలతో కేటుగాళ్లు ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నాటకలో చోటు చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని మేరీ హిల్ కు చెందిన డెబ్బై ఏళ్ల వృద్ధుడు కొంత కాలంగా మ్యూచవల్ ఫండ్స్ (mutual funds) లో పెట్టుబడులు పెడుతున్నాడు. కాగా షేర్ల గురించి ఇంకా తెలుసుకోవాలని భావించిన ఆయన ఇంటర్నెట్ లో వెతకడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆగస్టు 10వ తేదీన ఆయన ఓ నంబర్ కు ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి మరో నంబర్ కు ఫోన్ చేయాలని సూచించగా.. అతను చెప్పిన నంబరు ఆయన ఫోన్ చేశాడు. ఈ సారి ఓ మహిళ మాట్లాడగా.. తాను మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని ఆయన ఆమెకు వివరించాడు. దీంతో ఆమె మరో నంబర్ నుంచి ఫోన్ చేసి ‘రస్ట్ డెస్క్’ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పింది. ఆ యాప్ లో కావాల్సిన సమాచారం దొరుకుతుందని మాయ మాటలు చెప్పింది.

ఆమె చెప్పినట్లే ఆయన ఆ యాప్ ను తన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. అయితే ఆ తరువాత స్క్రీన్ మొత్తం ఎర్రర్ అని చూపించడంతో ఏం జరిగిందో తెలియక ఫోన్ పక్కన పెట్టేశాడు.

అయితే సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 26 వేలు, బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ నుంచి రూ. 2లక్షలు, రెండు ఎస్బీఐ అకౌంట్ల నుంచి రూ.1.43 లక్షలు, రూ. 35 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో ఆ వృద్దడు కంగు తిన్నాడు. మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా గత నెలలో కూడా ఓ వ్యాపారవేత్తని ఇలాగే మోసం చేసి రూ.57 వేలు దోచేశారు పోలీసులు తెలిపారు.

What do you think?

రియల్ స్టార్ ఉపేంద్ర పై కేసు నమోదు

ఉత్తరప్రదేశ్ లో దేవుడికి తల అర్పించబోయిన వ్యక్తి