in

రియల్ స్టార్ ఉపేంద్ర పై కేసు నమోదు

రియల్ స్టార్ ఉపేంద్ర పై కేసు నమోదు

నటుడు ఉపేంద్ర చేసిన కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళ్తే తన ‘ప్రజాకీయా’ రాజకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా రియల్ స్టార్ ఉపేంద్ర ఇటీవల ఫేస్బుక్, ఇన్స్టా లలో లైవ్ నిర్వహించారు. అయితే ఈ లైవ్ లో ఆయన విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ సామెతలు చెప్పారు. దీంతో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో ఉపేంద్ర దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని బెంగళూరులో పిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఉపేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపడం గమనించి ఉపేంద్ర అలా మాట్లాడినందుకు క్షమాపణలు కోరడంతో పాటు ఆ లైవ్ వీడియోను కూడా ఇన్స్టా నుంచి డిలీట్ చేశారు.

What do you think?

కళ్ళతో చూసినా చెప్పలేని నిజం- కథ

స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా 4లక్షలు కొట్టేశారు