in

ఫేస్బుక్ కార్యకలాపాలు నిలిపివేస్తాం – హైకోర్ట్ హెచ్చరిక!

ఫేస్బుక్ కార్యకలాపాలు నిలిపివేస్తాం – హైకోర్ట్ హెచ్చరిక!

 

సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కార్యకలాపాలను భారత్ లో నిలిపి వేస్తామంటూ కర్ణాటక హైకోర్ట్ ఫేస్ బుక్ ను హెచ్చరించింది. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శైలేష్ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో గత 25 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య కవిత మంగళూరుకు సమీపంలో బికర్నకట్టె గ్రామంలో పిల్లలతో నివసిస్తోంది. ఆయితే 2019 లో శైలేష్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఎన్ ఆర్సీ (NRC), సీఏఏ (CCA) కు మద్దతుగా ఒక పోస్ట్ పెట్టాడు. ఆ తరువాత శైలేష్ పేరుతో గుర్తు తెలియని ఓ వ్యక్తి సౌదీ రాజును, ఇస్లాం పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసింది శైలేష్ అని భావించిన సౌదీ పోలీసులు శైలేష్ ను అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు.

శైలేష్ తనకు ఆ పోస్టులకు సంబంధం లేదని తన భార్య కవితకు చెప్పి మంగళూరులోని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయమని కోరాడు. దీంతో కవిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న మంగళూరు పోలీసులు శైలేశ్ ఫేక్ అకౌంట్ గురించి వివరాలు తెలపాలని ఫేస్ బుక్ ను కోరారు. కానీ వారి అభ్యర్థనలకు ఫేస్ బుక్ స్పందంచలేదు. ఫేస్ బుక్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో 2021 లో కవిత కర్నాటక హై కోర్టును ఆశ్రయించింది.

అయితే కర్నాటక హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఫేస్ బుక్ పట్టించుకోలేదు. దీంతో కర్నాటక హైకోర్టు ఫేస్ బుక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇదే తీరు కొనసాగిస్తే, భారత్ లో ఫేస్ బుక్ కార్యకలాపాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. శైలేశ్ ను సౌదీలోని జైలు నుంచి విడిపించడానికి చేపట్టిన చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కర్ణాటక హై కోర్ట్ ఆదేశించింది.

What do you think?

ముగిసిన వైసీపీ ఎంపీ భార్యా,కుమారుడి కిడ్నాప్ డ్రామా

ఆ మాట చెబితే రాజకీయ సన్యాసం తీసుకుంటా – కొడాలి