in ,

ఆ మాట చెబితే రాజకీయ సన్యాసం తీసుకుంటా – కొడాలి

ఆ మాట చెబితే రాజకీయ సన్యాసం తీసుకుంటా – కొడాలి

 

మంత్రి కొడాలి నాని చంద్రబాబు, పవన్ లపై తీవ్ర విమర్శలు చేశారు. మగాడైతే అక్కడి నుంచి పోటీ చేసి చూపించమని చంద్ర బాబుకు సవాల్ విసిరారు.

ఇటీవల గుడివాడలో జరిగిన ఇళ్ళ పట్టాల పంపిణీ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి జగన్ శాశ్వత సీఎం అంటూ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గుడివాడలో ఒక్క ఎకరా భూమి కొనుగోలు చేసినా, నీటి సమస్య పరిష్కారానికి ఎకరా భూమి కొన్నట్లు చెప్పినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మాత్రమే పార్టీ పెట్టారని విమర్శించిన కొడాలి 16 పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఏం సాధించారని ప్రశ్నించారు.

What do you think?

ఫేస్బుక్ కార్యకలాపాలు నిలిపివేస్తాం – హైకోర్ట్ హెచ్చరిక!

పోలీసు ప్రాణం తీసిన ఇసుక మాఫియా..