in

కరోనాకు భయపడి మూడేళ్ళపాటు ఇంట్లోనే గడిపిన ఓ మహిళ

కరోనాకు భయపడిన ఒక మహిళ తన బిడ్డతో మూడేళ్ల పాటు ఇంట్లోనే గడిపింది. ఆఖరికి విసిగిపోయిన భర్త పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బయటకి రప్పిస్తే కానీ బయటకు రాలేదు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన హర్యానాలోని గురుగ్రాం జిల్లాలో చోటు చేసుకుంది.

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాంకి చెందిన ఒక మహిళ కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు తన భర్త, బిడ్డతో కలిసి లాక్ డౌన్ లో ఇంట్లోనే గడిపింది. అయితే బయట ప్రపంచానికి దూరంగా ఇంట్లో ఉండడంతో మానసికంగా దెబ్బతిన్న ఆ మహిళ సెకండ్ వేవ్ వచ్చిన తరువాత తన భర్త ఆఫీస్ కి వెళ్ళిన సమయంలో తన బిడ్డతో ఇంట్లో ఉంటూ ఎవరూ లోపలికి రాకుండా ఇంటికి తాళం వేసింది. ఆఖరికి తన భర్త వచ్చినా సరే లోపలికి రానివ్వకుండా అడ్డుకుంది. దీంతో ఆ భర్త చక్కర్పూర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ నివసిస్తూ వారికి కావాల్సిన నిత్యావసరాలను బయట నుండి అందిస్తూ గడిపాడు. అయితే కరోనా తగ్గిన తరువాత కూడా ఆ మహిళ బయటకు రాకపోవడంతో విసిగిపోయిన భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు.

మొదటి సారి కుటుంబ సమస్య అనుకుని అంతగా పట్టించుకోని పోలీసులు, రెండు – మూడు సార్లు పోలిస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తూ పదే పదే తిరుగుతున్న వ్యక్తిని గమనించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి సహాయంతో ఆ మహిళను, బిడ్డను బయటకు వచ్చేలా చేశారు.

What do you think?

లౌక్యం తో నిండు ప్రాణాన్ని కాపాడిన ట్రాఫిక్ పోలిస్

గ్రూప్ – 2, గ్రూప్ -3 ఉద్యోగ నియామకాల్లో మార్పు.