in

లౌక్యం తో నిండు ప్రాణాన్ని కాపాడిన ట్రాఫిక్ పోలిస్

హైదరబాద్ లోని ఓ ట్రాఫిక్ పోలీస్ లౌక్యం గా వ్యవహరించి రోడ్డుపై కుప్పకూలిపోయిన వ్యక్తిని కాపాడాడు. నెటిజన్ల ప్రశంసలు పొందాడు.

వివరాల్లోకి వెళ్తే రాజేంద్రనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్‌కు చెందిన బాలరాజ్ అనే యువకుడికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. బాలరాజ్ కుప్పకూలిపోవడం చూసిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ అప్రమత్తం అయ్యి లౌక్యంగా వ్యవహరించి కాపాడేందుకు సీపీఆర్ చేశాడు. యువకుడికి సీపీఅర్ చేస్తూనే 108 కి కూడా పోన్ చేయించాడు. ఆ తరువాత వెంటనే జర్మన్ టెక్ ఆసుపత్రికి తరలించాడు.

ఇప్పుడు బాలరాజ్‌ క్షేమంగా ఉన్నాడని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇక బాలరాజ్ ను లౌక్యంతో కాపాడిన రాజశేఖర్ కాపాడడంతో నేటిజన్లు రాజశేఖర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

What do you think?

కొడుకై తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు

కరోనాకు భయపడి మూడేళ్ళపాటు ఇంట్లోనే గడిపిన ఓ మహిళ