in

ఆదివాసి కాళ్ళు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్

ఆదివాసి కాళ్ళు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్

 

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ఓ ఆదివాసి కాళ్ళు కడిగారు. ఈ ఘటనను విడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది.

విషయం ఏంటంటే ప్రవేశ్ శుక్లాను అనే వ్యక్తి ఓ ఆదివాసి పైన మూత్ర విసర్జన చేశాడు. మూడు నెలల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పొలీసులు ఇటీవల పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతని ఇల్లును కూడా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూల్చి వేసింది. అయితే ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో మధ్య ప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీనికి సంబంధించిన ఓ విడియో నెట్టింట వైరల్ గా మారింది.

దీంతో ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం శివ రాజ్ సింగ్ స్పందించారు. ఆ ఆదివాసిని గురువారం (06/07/23) భోపాల్ లోని తన నివాసానికి పిలిపించి సీఎం స్వయంగా అతడి కాళ్లు కడిగారు. అనంతరం అతడిని పరామర్శించారు.

‘ఈ ఘటన నన్నెంతో బాధించింది. ఈ విషయమై క్షమాపణలు కోరుతున్నాను. ప్రజలు నాకు దేవుడితో సమానం’ అని తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలను సహించేదే లేదని అన్న సీఎం శివ రాజ్ సింగ్, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి గౌరవం తన గౌరవమేనని  అన్నారు.

అయితే ఇదిలా ఉండగా మరో వైపు ఇది పబ్లిసిటీ స్టంట్ అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.

What do you think?

దళితులన్న కారణంతో క్షవరం చేసేందుకు నిరాకరిస్తున్నారు

హయత్ నగర్ కిడ్నాప్ డ్రామా.. బాలిక ఆడిన నాటకం