in ,

గమ్యం లేని కాంగ్రెస్ పార్టీ… గట్టెక్కేనా..

గమ్యం లేని పార్టీ… గట్టెక్కేనా..

కాంగ్రెస్ పార్టీ ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజుకొక పరిణామం పార్టీ నాయకత్వానికి కునుకు లేకుండా చేస్తుంది. సీనియర్ నేతలు బాధ్యతలు మాకొద్దు బాబోయ్ అని తప్పుకుంటున్నారు. అలాగని జూనియర్ లు కూడా ఉండడం లేదు. అసలు కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి. అధికారం సంగతి తర్వాత అసలు పార్టీ మనుగడే కష్టమా ?

2019 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతల బాధ్యత నుండి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. అప్పటినుండి ఆ పార్టీ లో నాయకత్వ లేమి కనిపిస్తుంది. సోనియా గాంధీ పార్టీ ని నడిపిస్తున్నప్పటికీ గత ఎనిమిదేళ్లుగా ఆమె అంత ఆక్టివ్ గ ఉండలేకపోతున్నారు.
కాంగ్రెస్ కు వరసగా సీనియర్ ల రాజీనామాలు షాకిస్తున్నాయి. వారసత్వ బాధ్యతలలో భాగంగా గతం లో రాహుల్ గాంధీ ఏ ఐ సి సి అధ్యక్షుడయ్యారు. తాను తొలిసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత 2012 యూ పి అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పార్టీ పరాజయాల పరం పర పదేళ్లుగా కొనసాగుతూనే ఉంది.

వందేళ్ల చరిత్ర గల్గిన కాంగ్రెస్ ఎన్నో సంక్షోభాలను చూసింది. అయినప్పటికీ శతాబ్దం తర్వాత కూడా బలమైన పార్టీ గానే కొనసాగుతుంది. ఇందుకు పార్టీ లో దిగ్గజ నేతలతో కూడిన వ్యూహాత్మక బృందానిది కీలక పాత్ర అని చెప్పొచ్చు. పార్టీ లో అంతర్గత విబేధాలు, ఆయా రాష్ట్రాల్లో సంక్షోభాలు, పార్లమెంట్ లో వ్యవహారాలు కీలక ఎన్నికల సమయం లో ఎప్పటికపుడు వ్యూహాలు రచించే బాధ్యత నిర్వహిస్తూ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు పట్టగానే నాటినుండి వ్యూహాలన్నీ మారిపోయాయి. 2014 లో మొదలయిన ప్రతికూల పరిస్థితుల ప్రభావం 2019 నాటికీ మరింత తీవ్రమైంది.

2019 ఎన్నికల తర్వాత రాహుల్ అధ్యక్ష బాధ్యతలనుండి తప్పుకోటం తో అధ్యక్షుడిని ఎన్నుకోటం కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా మారింది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ లో భాగం గ ఏ ఐ సి సి అధ్యక్షుడిని ఎన్నుకోవటం ఇపుడు అనివార్యం.

గాంధీలు కూడా నేతల ఎంపికలో తడపడుతున్నారు. ఆజాద్ లాంటి నేతల్ని వదులుకోవడం తో ఇపుడు అధ్యక్ష పదవి చేపట్టే స్థాయి ఉన్న నేతలు ను వెతుక్కోవాల్సి వస్తుంది. అసలు జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నేతలే తక్కువ. ఉన్నా అందరి పైన రిమార్కులున్నాయి. అన్ని లెక్కలు వేసి గెహ్లాట్ కు ఛాన్స్ ఇద్దామనుకుంటే అది పెద్ద సమస్య అయింది. పోనీ థరూర్ ను పుష్ ఇద్దామనుకుంటే ఆయనేం చేస్తాడో ఆయనకే తెలీదు. దిగ్విజయ్ సీనియర్ అయినా వివాదాస్పత నేత. కమల్ నాథ్ కూడా అంతే, ఆంటోనీ నిజాయితీ పరుడు అధ్యక్ష పదవి నిర్వర్తించగలరా అన్న ప్రశ్నలున్నాయి. జయరాం రమేష్, చిదంబరం లాంటి నేతలు మేధావులే కానీ క్యాడర్ కు అందుబాటులో ఉండరు.

గతం లో సీనియర్ లు కాంగ్రెస్ ను ప్రతిపక్షాలకు చేరువ చేయటం లో కీలక పాత్ర పోషిస్తే, ఇప్పుడున్న సీనియర్ లు పాత మిత్రులను కూడా దూరం చేస్తున్నారు. కనీసం పార్లమెంట్ లో ఫ్లోర్ కోఆర్డినేషన్ కు దిక్కు లేదు. ఇలా అయితే పార్టీ ఎలా అధికారం లోకి వస్తుంది. ఇతర పార్టీ లు ఎలా నమ్ముతాయనే స్పృహ ఎవరికీ లేదు. కాంగ్రెస్ క్కు ఇప్పటికి అవకాశం ఉంది. గట్టి సంకల్పం తీసుకుంటే చాలు. చాలా సమస్యలు తీరతాయి. అధికారమే లక్ష్యం గ వ్యూహ రచన చేస్తే కాంగ్రెస్ కు ప్రజలు కూడా మద్దతు పలుకుతారు. కాంగ్రెస్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలనేదే అందరి కోరిక.

ప్రతి వ్యవస్థ ఐదు దశల పరిణామానికి గురి అవుతుందని అంటారు. విజయం ద్వారా వచ్చిన తొలి గర్వం తొలిదశ. క్రమశిక్షణ రాహిత్యం రెండోది. ప్రమాద హెచ్చిరికలను తోసిపుచ్చడం మూడోది. నాలుగో దశ నిర్వాణాన్ని అంగీకరించడం అయితే చివరిది ఎవ్వరికి పట్టని దశ. కాంగ్రెస్ ది. ఏ దశ? ఏ దిశ?

గమ్యం లేని పార్టీ .. గట్టెక్కేనా

What do you think?

సూపర్ కాప్-తొమ్మిదేళ్ల నిరీక్షణ..”గర్ల్ నెంబర్166″

జీవో నం1ను కొట్టేసిన హైకోర్ట్.షాక్లో ఏపీ ప్రభుత్వం