in

పిల్లలు పుట్టడం లేదని మనుషుల ఎముకలు తినిపించిన భర్త. బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు.

మనుషులు మూన్ మీద లాండ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. లాండ్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లయ్యాయి, అడవులు హై టెక్ సిటీలయ్యాయి, ట్రైన్ లు సూపర్ ఫాస్ట్ మెట్రోలయ్యాయి. అయితే ఇలా ప్రతి దశలో అభివృద్ది చెందుతూ అద్బుతాలు సృష్టిస్తున్న మనం ఒక్క ఆలోచనా విధానంలో మాత్రం 50 ఏళ్ల వెనకే ఉండిపోయాం. ఇప్పటికీ మనం చికిత్స కంటే క్షుద్ర పూజలనే ఎక్కువ నమ్ముతున్నాం. తేడా వస్తే డాక్టర్ ని కలవాల్సింది పోయి డకోటాలని కలుస్తున్నాం. ఈ నమ్మకమే ఇప్పుడు ఒక అమానవీయ సంఘటనకు దారితీసింది.
ఒక మహిళకు పిల్లలు పుటట్లేదనే నెపంతో ఆమె భర్త, అత్తామామలు క్షుద్రపూజలు చేయించారు, మాంత్రికులతో తంత్రాలు వేయించారు, ఆఖరికి ఆమెతో శ్మశానంలో ఎముకులను కూడా తినిపించారు. ఈ అమానవీయ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే పుణెకు చెందిన ఒక మహిళకు తెలియని కారణాల వల్ల పిల్లలు కలగలేదు.దీంతో సంతానం కలగలేదని భర్త,ఆమె అత్త మామాలు ఆమెను గత కొంత కాలంగా శారీరకంగా,మానసికంగా హింసిస్తున్నారు. ఆమెపై నరబలి, జంతుబలి చేసే తాంత్రిక విద్యలు తెలిసిన మంత్రగాళ్లతో క్షుద్ర పూజలు చేయించారు. శ్మశానంలో బాధిత మహిళను కూర్చొబెట్టి మనిషికి కూడా ఎముకలను తినిపించారు.
ఇక అత్తమామలు,భర్త ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ పిర్యాధుతో మూఢనమ్మకాల నిరోధక చట్టం సెక్షన్ 3తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498A,323,504,506 కింద కేసు నమోదు చేశారు.పూణె నగర డిప్యూటీ కమిషనర్ సుహైల్ శర్మ ఈ వివరాలను తెలిపారు.ఈ ఘటనపై మహారాష్ట్ర మహిళ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రూపాలీ చకంకర్‌ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని,ఘటనపై నివేదిక సమర్పించాలని ఆమె పోలీసులను ఆదేశించారు.

What do you think?

331 Points
Upvote Downvote

కర్ణాటకలో జరిగిన ఈవెంట్ లో పాటల కోయిల మంగ్లీ పై రాళ్ళ దాడి…

ఆత్మ హత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్న యువ నటుడు సుదీర్ వర్మ.