in ,

“ప్రజాస్వామ్యం అపహాస్యమైంది” చంద్రబాబు అరెస్ట్ పై కె.రాఘవేంద్ర

“ప్రజాస్వామ్యం అపహాస్యమైంది” చంద్రబాబు అరెస్ట్ పై కె.రాఘవేంద్ర

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ప్రతి పక్షనేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతుంది.

ఆయన అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తమ అధినేతను విడుదల చేయాలని మహిళా కార్యకర్తలు వైజాగ్‌లో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ లో సైతం కేబీఆర్ పార్క్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు.

మరో వైపు చంద్రబాబు అరెస్టుపై సినీ పెద్దలు, రాజకీయ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆయన అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని మండిపడగా.. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని, ప్రజా సంక్షేమాన్ని జగన్ గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై దాడులకు దిగుతున్నారని, చంద్రబాబును జైల్లో ఉంచడమే జగన్ కుట్రని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు. “ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేశారు. గతంలో వైజాగ్‌లో కూడా జనసేన నేతలపై ఇలాగే వ్యవహరించారు. శాంతి భద్రతల విషయంలో వైసీపీ నాయకుల జోక్యం ఏంటీ? చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నాయకులు ఆందోళన చేస్తే తప్పా..? జగన్ రాజకీయ కక్ష్య సాధింపుకు పాల్పడుతున్నారు.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు.

What do you think?

మూడేళ్ల బాలుడి అరుదైన రికార్డు!

వెనుకబడిన వర్గాలకు రూ.లక్ష సాయం. అప్లై చేసుకోండిలా